CULTURAL GRANDEUR AT SRI PAT BTU_ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
By TTD News On 7 Dec, 2018 At 06:54 PM | Categorized As Brahmotsavams

Tiruchanoor, 7 Dec. 18: The TTD rolled out variety of cultural programs invkufing bhakti sangeet, and religious discourse under the aegis of HDPP, Dasa hayita ana Annamachaya project s, and the SV Music and drama college at the ongoing Karthika Brahmotsavam of Sri Padmavati Ammavari Temple.

The program by SV Music College commenced at Asthana mandapam with Mangaladwani and later Vedanarayana by Students of SV Veda pathashala.

From 10 am there was religious discourse by Sri PTG Sampat Kumar acharyulu and later bhakti sangeet by Bhavna Madhulika Sangram of Hyderabad in the afternoon Mogilcherla Nagamani of Teni rendered Harikatha parayanam. The Raghunath troupe from Tirupati presented Annamaiyya sankeertams. At night TTD Astana Vidwans Sri Garimella Balakrishna Prasad rendered Annamayya keertans.

Similarly at the Mahanti auditorium the Dr Nandini Shivaprakash troupe from Chitradurga in Karnataka presented a music ballet. At the Annamacharya Kalamandir the the CH Santilakshmi team from Tirupati presented Bharata Natya. At tne Ramachandra Pushkarani in Tirupati, the team of H Adinarayana presented folk dances. Finally Bhakti sangeet program was presented by first year students of SV Music College at the Shilparamam on Tiruchanoor road.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ

డిసెంబరు 07, తిరుప‌తి, 2018: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.

తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఎస్‌.వి.సంగీత కళాశాల ఆధ్వ‌ర్యంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ పిటిజివై.సంప‌త్ కుమారాచార్యులు ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన భ‌వ్య‌, మ‌ధులిక బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తెనాలికి చెందిన మోగిల్‌చ‌ర్ల నాగ‌మ‌ణి హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. కాగా సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ బి.ర‌ఘునాథ్ బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, రాత్రి 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవలో టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆల‌పిస్తారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు చిత్ర‌దుర్గ‌కు చెందిన డా.. నందిని శివ‌ప్ర‌కాష్ బృందం నృత్య‌నాటిక‌, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ సి.హెచ్‌.శాంతిల‌క్ష్మి బృందం భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద తిరుప‌తికి చెందిన హెచ్‌.ఆదినారాయ‌ణ బృందం జాన‌ప‌ద నృత్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌న్నున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తిలోని ఎస్వీ సంగీత క‌ళాశాల ఎం.ఏ ప్ర‌వీణ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులు భ‌క్తి సంగీతం వినిపిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `