CHILDRENS DAY AT SV SCHOOL FOR DEAF AND DUMB_ ఎస్వీ బధిరోన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
By TTD News On 14 Nov, 2017 At 03:22 PM | Categorized As General News

Tirupati, 14 November 2017: Children’s Day was celebrated in a grand style at the SV Deaf and Dumb school with active participation by the CVSO Sri Ake Ravi Krishna who has adopted the institution.

Speaking on the ocassion the CVSO said urged the students to study well and achieve their goals and become active partners in nation building activities.The CVSO couple also partook community lunch with 500 students of the institution.

Among others TTD vigilance VGO Smt Sadalakshmi, Tirupati VGO Sri Ashok Kumar, AVSO Sri Ganga Raju, School principal Smt Nalini, teachers and other staff participated in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ బధిరోన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

నవంబరు 14, తిరుపతి, 2017టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ బధిరోన్నత పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ పాఠశాలను సివిఎస్‌వో దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలబాలికలు ఏకాగ్రతతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అనంతరం పాఠశాలకు చెందిన 500 మంది విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంలో సివిఎస్‌వో దంపతులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విజిలెన్స్‌ విజివో శ్రీమతి సదాలక్ష్మి, తిరుపతి విజివో శ్రీ అశోక్‌కుమార్‌గౌడ్‌, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి నళిన, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am