DEITIES DAZZLE ON SARVABHOOPALA VAHANA _ సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప

Tirumala, 24 Sep. 20: Flanked by Sridevi and Bhudevi, Sri Malayappa Swamy dazzled on Sarvabhoopala vahanam on the evening of Thursday.

This is for the second time Lord appeared on this unique vahanam. In view of Covid 19 restrictions, in the place of Golden Chariot, the Lord along with His two consorts graced on Sarvabhoopala Vahanam on sixth day evening as part of ongoing annual brahmotsavams at Tirumala temple.

TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Board members Sri Ananta, Sri Siva Kumar, Sri Govind Hari, DP Anantha, Sri Sekhar Reddy, Dr Nischitha, Sri Kumarguru, Smt Prasanthi Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Srivari temple DyEO Sri Harindranath were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప
తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 24: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం  సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు డా.నిశ్చిత‌, శ్రీ శివకుమార్, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.