DEVELOP TTD LOCAL TEMPLES- JEO LAKSHMIKANTHAM_ టిటిడి అందించిన పంచలోహ విగ్రహాలపై పరిశీలన జరగాలి -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 20 Feb. 19: Tirupati Joint Executive Officer Sri B Lakshmikantham today called for an urgent need for all round development of TTD locals temples.

He was addressing a review meeting of OSDs, DyEO, and other engineering departments of TTD local temples in his chambers to promote infrastructure in these temple with priority on devotee conveniences.

He said today that HDPP should review on how many Pancha Loha idols were provided on subsidy to temples and their maintenance and on how many more such idols could be given to other temples future.

The JEO said the TTD magazine Sapthagiri subscribers database should be updated with details of address, phone and e-mails.

He also advised officials to provide online facility for devotees to book rooms at Sri Padmavati nilayam in Tiruchanoor and also improve greenery around the guesthouse.

He said steps should be taken for keeping keys of Hindi’s of TTD local temples with AEOs. The officials also should maintain registers of donations, contributions, and padikavili (visitors).

He said the Museum located in the front side of Sri Govindaraja team should be shifted to old Huzur Office.

The JEO said the forthcoming calendars and diaries of 2020 should be made available at all TTD information centres across the country.

The TTD CE Sri Chandrasekhar Reddy, FACAO Sri O Balaji, SEs Sri Ramesh Reddy, Sri Ramachandra Reddy, Sri Ramulu, SE (Ele) Sri Venkateswarlu, RTC RM Sri Chengal Reddy and officials of Railways, Postal and Tourism department participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి అందించిన పంచలోహ విగ్రహాలపై పరిశీలన జరగాలి -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 20: సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై టిటిడి అందిస్తున్న పంచలోహ విగ్రహాలపై హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో పరిశీలన జరగాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్ని ఆలయాలకు టిటిడి రాయితీపై పంచలోహ విగ్రహాలు అందించింది, ఎన్ని ఆలయాలలో విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు, తదితర సమాచారంపై హెచ్‌డిపిపి ఆధ్వర్యంలో పరిశీలన నిర్వహించాలని, తద్వారా మరిన్ని ఆలయాలకు విగ్రహాలు అందించవచ్చునని అన్నారు. సప్తగిరి మాస పత్రికను సకాలంలో పాఠకులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా చందాదారుల చిరునామా, ఫోన్‌ నెంబర్లు, ఈ-మెయిల్‌ ఐడిలు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ పూర్తి చేయాలన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంలో భక్తులు ఆన్‌లైన్‌లో వసతి పొందేందుకు అవసరమైన ఏర్పాట్లను వారంలోపు పూర్తి చేయాలన్నారు. పద్మావతి నిలయం వద్ద పచ్చదనం పెంపొందించడానికి విరివిగా మొక్కలు నాటాలన్నారు.

టిటిడి స్థానిక ఆలయాలలోని హుండీలకు సంబంధించిన తాళం చెవులు సంబంధిత ఆలయ ఉన్నతాధికారుల వద్ద ఉండాలన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలలో ఉన్న సమాచార కేంద్రాలలో ఉన్న హుండీల తాళాలు ఏఈవోల వద్ద ఉండేల చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి అనుబంధ ఆలయాలలో సమర్పణ రిజిష్టర్‌, కానుకల రిజిష్టర్‌, పడికావిలి రిజిష్టర్‌లను విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద ఉన్న మ్యూజియంను, ఆలయంకు వెనుక వైపు గల పాత హూజురు ఆఫీసులోనికి మార్చడానికి స్థల పరిశీలన చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాబోవు 2020 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే భక్తులకు దేశంలోని వివిధ ప్రాంతాలలోని టిటిడి సమాచార కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

అనంతరం టిటిడి స్థానిక ఆలయాల అభివృద్ధి కొరకు నియమించిన ప్రత్యేక అధికారులు, డెప్యూటీ ఈవోలు, ఇంజినీరింగ్‌ అధికారులతో ఆయా ఆలయాల అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై జెఈవో సమీక్షంచారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, ఎస్‌ఇలు శ్రీరమేష్‌రెడ్డి, శ్రీ రామచంద్రరెడ్డి, శ్రీ రాములు, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్‌) శ్రీ వెంకటేశ్వర్లు, ఆర్‌టిసి ఆర్‌ఎమ్‌ శ్రీ చంగల్‌ రెడ్డి, రైల్వే, పోస్టల్‌, ఏపి టూరిజం, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.