ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు దేవునిగడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
By TTD News On 18 Jan, 2019 At 05:46 PM | Categorized As Press Releases

ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు దేవునిగడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

జనవరి 18, తిరుపతి 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవునిగడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 5న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల తరువాత ఫిబ్రవరి 15న పుష్పయాగం జరుగనుంది.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

06-02-2019(బుధవారం) ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం

07-02-2019(గురువారం) సూర్యప్రభవాహనం పెద్దశేష వాహనం

08-02-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం సింహవాహనం

09-02-2019(శనివారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

10-02-2019(ఆదివారం) ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం

11-02-2019(సోమవారం) కల్యాణోత్సవం గజవాహనం

12-02-2019(మంగళవారం) రథోత్సవం ధూళి ఉత్సవం

13-02-2016(బుధవారం) సర్వభూపాల వాహనం అశ్వ వాహనం

14-02-2019(గురువారం) వసంతోత్సవం, చక్రస్నానం హంసవాహనం, ధ్వజావరోహణం.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az