DHWAJAROHANAM PERFORMED IN CHANGRAGIRI RAMA SHRINE_ ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
By TTD News On 15 Apr, 2019 At 12:02 PM | Categorized As Brahmotsavams, Temple News

Chandragiri, 15 April 2019; 19The annual brahmotsavams off to a religious start in Sri Kodandarama Swamy temple at Chandragiri with Dhwajarohanam on Monday.

This Garuda flag hoisting ceremony took place in the auspicious Vrishabha Lagnam between 9am and 10am.

Temple DyEO Sri Subrahmanyam, AEO Sri Nagaraju and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఏప్రిల్ 15, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీకోదండరామస్వామివారి ఆల‌యంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. స‌క‌ల‌దేవ‌త‌ల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తూ ఉదయం 9 నుండి 10 గంటల మ‌ధ్య‌ వృషభ లగ్నంలో ఈ ఘ‌ట్టాన్ని నిర్వ‌హించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేప‌ట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మ‌ర‌ణ‌ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ శ్రీ‌నివాస‌భ‌ట్టార్‌, కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ ఎం.కృష్ణ‌భ‌ట్టార్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ముందుగా ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు మూలవర్లకు అభిషేకం, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ఉత్సవర్లకు అభిషేకం చేప‌ట్టారు. కాగా, ప్రతిరోజూ సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు ఘంటానాదం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 18వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఏప్రిల్‌ 20వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. రూ.750/- టికెట్‌ కొనుగోలు చేసి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్‌ 23న ఉదయం 9 నుండి 10 గంటల వరకు వసంతోత్సవం, ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 8.00 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్‌ 24వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ నాగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ చైతన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v