DISPLAY TTD INFORMATION FOR THE EASE OF PILGRIMS-EO_ డిస్‌ప్లే బోర్డుల ద్వారా భక్తులకు సమాచారం తెలియజేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌
By TTD News On 5 Jan, 2019 At 04:17 PM | Categorized As General News

Tirupati, 5 January 2019: Electronic LED boards need to be set up to display TTD information at different vital places in Tirumala and in Tirupati, for better knowledge of the visiting pilgrims, said TTD EO Sri Anil Kumar Singhal.

The senior officers review meeting took place at conference hall in TTD administrative building on Saturday. EO along with Tirupati JEO Sri P Bhaskar and CVSO Sri Gopinath Jetti reviewed on various activities.

The EO instructed the concerned to place LED boards at vital places and junctions in Tirumala and Tirupati. The boards should display the temple timings, about arjitha sevas, accommodation and other details pertaining to Tirumala as well about local temples. As soon as the pilgrim lands in Railway station or Bus station he should be able to know about his destined place of visit to avoid confusion”, EO added.

Later he said, the pilgrims who are coming with token based darshanams should be allowed to enter into the compartments only during their time slots. Vigorous publicity through announcements is required’, he said.

The EO instructed the engineering wing officials that cable wiring in mada streets of Tirumala to be completed before Radhasapthami. The wires and ducts are not be seen outside”, he directed.

Later he instructed the concerned to distribute Sapthagiri free of cost in the vernacular language of the area whenever Srinivasa Kalyanams are performed.

CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిస్‌ప్లే బోర్డుల ద్వారా భక్తులకు సమాచారం తెలియజేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జనవరి 05, తిరుపతి 2019: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌, బస్టాండులో దిగగానే శ్రీవారి ఆలయం, స్థానికాలయాల సమాచారాన్ని డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలియజేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని ముఖ్య కూడళ్లలోనూ తిరుమల, తిరుపతిలోని ఆలయాల దర్శనవేళలు, ఆర్జితసేవలు, వసతి గదులు తదితర సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే క్యూకాంప్లెక్స్‌లోకి చేరుకునేలా తిరుమలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తిరుమలలో రద్దీ రోజుల్లో భక్తులు లగేజి ఎక్కడ డిపాజిట్‌ చేయాలి, ఎక్కడ తిరిగి పొందాలి అనే విషయాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. రథసప్తమినాటికి మాడ వీధుల్లో ఎస్వీబీసీ, రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌, సిసిటివి వైర్లు బయటకు కనిపించకుండా భూగర్భ కేబుల్‌ వ్యవస్థను పూర్తి చేయాలన్నారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న శ్రీవారి కల్యాణోత్సవాల్లో భక్తులకు ఆయా భాషల సప్తగిరి మాసపత్రికను ఉచితంగా పంపిణీ చేయాలని ఈవో ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే భక్తులకు మరింత వేగంగా సులభతరంగా పోస్టల్‌ శాఖ ద్వారా బట్వాడా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ముఖ్య నగరాల్లో ఉన్న టిటిడి సమాచార కేంద్రాల్లో డైరీలు, క్యాలెండర్లు నిల్వ ఉంచుకుని, అక్కడినుండే భక్తులకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నాటి యువతకు మన పండుగలు, వాటి విశిష్టత, సంప్రదాయాల గురించి, ప్రజలకు యోగా ప్రాముఖ్యత తెలియజేసేలా ఎస్వీబీసీలో ఆకట్టుకునేలా ప్రత్యేక కథనాలు ప్రసారం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v