ELABORATE ARRANGEMENTS FOR SRI SEETHARAMA KALYANAM – EO_ శ్రీ సీతారాముల క‌ల్యాణానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌
By TTD News On 18 Apr, 2019 At 05:20 PM | Categorized As General News

Vontimitta,18 Apr 19: TTD in co operation with the Kadapa district administration had made elaborate arrangements for the celestial event of Sri Sita Rama Kalyanam at Vontimitta, said TTD EO Sri Anil Kumar Singhal.

The EO who inspected the arrangements at Kalyana Vedika, told media that the two hour long divine Kalyana Will witness the participation of over a lakh devotees.

He said TTD has installed sheds outside the temple with German technology to accommodate these devotees keeping in view the past experiences.

The Kalyana Vedika is designed with grandeur with tons of flowers and electrical illumination.

TTD has set up food courts on both sides of Kalyana vedika to provide, drinking water, buttermilk and Anna Prasadam besides akshintalu with 1200 srivari seva volunteers.

The TTD health department has set up 300 mobile and temporary toilets, water sourcing and also deployed 460 sanitary workers to keep the holy venue clean.

The entire venue is kept under round the clock CC camera surveillance, he maintained.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ సీతారాముల క‌ల్యాణానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

ఒంటిమిట్ట, 2019, ఏప్రిల్ 18: ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురువారం జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడారు.

గురువారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు హస్తా నక్షత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుందన్నారు. కల్యాణవేదిక, ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జర్మన్‌ షెడ్లు ఏర్పాట్లు చేశామ‌న్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు క‌ల్పించామ‌న్నారు. కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు, టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది కలిపి 2 వేల మందితో బందోబస్తు ఏర్పాట‌చేశామ‌న్నారు. భక్తులందరూ కోదండరాముని కల్యాణం వీక్షించేలా 22 హెచ్‌డి డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. సంప్రదాయబద్ధంగా కల్యాణవేదికను సిద్ధం చేశామ‌ని, వాహనాల పార్కింగ్‌కు త‌గిన ఏర్పాట్లు చేశామ‌ని వివ‌రించారు. ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణలు, 60 దేవతామూర్తుల కటౌట్లు, శోభాయ‌మానంగా పుష్పాలంకరణలు చేప‌ట్టామ‌న్నారు.

భ‌క్తుల‌కు అన్నప్రసాద వితరణ కోసం వేదిక‌కు ఇరువైపులా క‌లిపి 150 కౌంటర్లు ఏర్పాటుచేశామ‌ని, 2 లక్షల ప్యాకెట్ల అక్షింతలు త‌యారుచేశామ‌ని, 2 లక్షల ప్యాకెట్ల మజ్జిగ, 6 లక్షల ప్యాకెట్ల తాగునీరు పంపిణీ చేశామ‌ని ఈవో వెల్ల‌డించారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 1200 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్ అందుబాటులో ఉంటార‌ని తెలిపారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం వైద్యశిబిరాలు, 300 మరుగుదొడ్లు ఏర్పాటుచేశామ‌ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 450 మంది పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉన్నార‌ని వివ‌రించారు. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా భక్తులకు సమాచారం, సూచనలు అందిస్తున్నామ‌న్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామ‌ని, ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఒంటిమిట్ట‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ద‌శ‌ల‌వారీగా పూర్తి చేస్తామ‌న్నారు.

ఈవో వెంట టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్‌నాయుడు, ఇఇ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v