ELABORATE STEPS FOR V DAY DARSHAN IN TIRUCHANOOR AND APPALAYAGUNTA: TIRUPATI JEO_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత‌ ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌
By TTD News On 15 Dec, 2018 At 09:40 PM | Categorized As General News

Tirupati, 15 Dec. 18: All arrangements have been completed for the upcoming two big festive days in Tiruchanoor and Appalayagunta temples said TTD Tirupati JEO Sri Pola Bhaskar on Saturday.

After inspecting the arrangements at Appalayagunta temple, the JEO told reporters that elaborate arrangements have been made for darshan, Anna pradadam, drinking water, queue lines, flower and electrical decoration, security, and cultural programs on both days .

Chief priest of temple Sri Surya Kumar Acharyulu said Vaikunta Ekadasi is also known as Mokshada Ekadasi and had its basis in the legend of Sri Ramayana protecting All Devatas from tyranny of Ravana.

He said Common devotees darshan will commence at 5.00 AM on December 18. Later the Lord and his consorts will be paraded on mada streets. Next day Chakrasnanam of the Utsava idols will be performed the temple Pushkarani.

Temple DyEO Smt Jhansi Rani, EEs Sri Manohar, Chandrasekhar, AEO Sri K Subramanyam, Supdt Sri Gopalakrishna Reddy,Avso Sri Nandiswar and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత‌ ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 డిసెంబరు 15: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాలకు విస్తృత‌ ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ వెల్లడించారు. ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఉదయం జెఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు డిసెంబరు 18, 19న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ఈ రెండు రోజుల్లో విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తామన్నారు. చలువపందిళ్లు, క్యూలైన్లతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్‌ దీపాలంకరణలు, సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని వివరించారు. భక్తులకు టిటిడి ఇచ్చిన సూచనలు, మార్గాలను దృష్టిలో ఉంచుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.

ఆలయ ప్రధానార్చకులు శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి మోక్షద ఏకాదశి అనే పేరు కూడా ఉందన్నారు. త్రేతాయుగంలో రావణుని నుండి కాపాడవలసిందిగా శ్రీ మహా విష్ణువును ముక్కోటి దేవతలు ప్రార్ధించగా, ఉత్తర దిశగా స్వామివారు ప్రత్యక్షమై శ్రీరామ అవతారంలో జన్మించి దేవతలకు అభయం కల్పించారు.

ఇందులో భాగంగా డిసెంబరు 18వ తేదీ ఉదయం 5.00 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. అనంతరం ఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. అదేవిధంగా ద్వాదశినాడు ఉదయం 10.00 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌.ఇ.రాములు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇఇలు శ్రీ మనోహర్‌, శ్రీ చంద్రశేఖర్‌, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీగోపాలకృష్ణారెడ్డి, ఎవిఎస్వో శ్రీ నందీశ్వర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v