EO INSPECTS MODEL WORK STATIONS_ మోడల్‌ కార్యాలయాన్ని పరిశీలించిన ఈవో
By TTD News On 15 May, 2019 At 06:45 PM | Categorized As General News

Tirupati, 15 May 19: TTD EO Sri Anil Kumar Singhal on Wednesday inspected model workstation in TTD Adminiatrative building in Tirupati aling with JEO Sri B Lakshmikantham and CVSO Sri Gopinath Jatti.

Later he made some instructions to the concerned officials to ensure that the model stations provide suitable working environment to the employees.

He said greenery should be developed outside and the workstations should have enough light and ventilation. Later he directed the engineering officials to develop a plan for other departments also.

Chief Engineer Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, SEs Sri Ramesh Reddy, Sri Venkateswarulu, DE Sri Ravi shankar Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మోడల్‌ కార్యాలయాన్ని పరిశీలించిన ఈవో

మే 15, తిరుపతి, 2019: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఏర్పాటుచేసిన మోడల్‌ కార్యాలయాన్ని బుధవారం ఈఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పరిశీలించారు. ఆధ్యాత్మికభావన కలిగేలా ఏర్పాటుచేసిన చిత్రపటాలను పరిశీలించారు. కారిడార్‌లో ఉద్యోగులకు, సందర్శకులకు మరింత భక్తిభావన కలిగేలా అనువైన ఎత్తులో శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, టిటిడి ఆలయాలు, శ్రీవారి వైభవానికి సంబంధించిన చిత్రపటాలను ఏర్పాటు చేయాలన్నారు.

మోడల్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఈవో అక్కడి ఫర్నీచర్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు అనువుగా కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆధునిక సౌకర్యాలతో కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. గాలి, వెలుతురు సక్రమంగా ఉండాలని, పచ్చదనం కోసం కిటికీల పక్కన మొక్కలు పెంచాలని అన్నారు. మోడల్‌ కార్యాలయం తరహాలో పరిపాలనా భవనంలోని ఇతర కార్యాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలు కార్యాలయాలను పరిశీలించి ఉద్యోగులతో మాట్లాడారు. విధి నిర్వహణలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌ జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, ఎస్‌ఈ-1 శ్రీ రమేష్‌ రెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, డిఈ శ్రీ రవిశంకర్‌ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v