CONTINUOUS MONITORING ON PILGRIM FACILITIES-EO_ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్

Tirupati, 16 Feb. 19: TTD EO Sri Anil Kumar Singhal instructed the officials to monitor round the clock on the amenities that are being provided to pilgrims in Tirumala.

During the senior officers coordination meeting held at conference hall in TTD administrative building in Tirupati on Saturday evening, the EO said, a cell need to be constituted with staff of all major departments to monitor continuously over the food, water, sanitation and other amenities.

A team of officers need to be constituted to monitor the time taken for Slotted sarva darshan, divya darshan and special entry darshanam. If lapses are identified that need to be sorted out immediately”, he added.

He also instructed the concerned to put correct information on LED screens installed in the compartments.

Later the EO also reviewed on the civil and other development works in Sri Kodanda Ramalayam at Vontimitta in Kadapa district. He directed the concerned to complete all the works in stipulated time. He also instructed the electrical wing to enhance lighting in all local temples and the forest wing to improve greenery.

The EO said that the online booking of accommodation should be introduced in Sri Padmavathi Nilayam complex which is set ready for inauguration.

Tirupati JEO Sri B Lakshmikantham, Sri Gopinath Jetti, DyEO General Smt Gourami, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, Estates Officer Sri Vijayasaradhi, GM Sri Sesha Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తులకు అందుతున్న సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2019 ఫిబ్రవరి 16: తిరుమలలో వేచియుండే భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై టిటిడి అధికారులతో కూడిన ప్రత్యేక బృందం నిరంతరం ఆరా తీసి మరింత మెరుగ్గా సేవలు అందించాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం తిరుపతి జెఈవో శ్రీ బి. లక్ష్మీకాంతంతో కలిసి సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లులో వేచియుండే భక్తులకు ఆయా సమయాలను బట్టి అందిస్తున్న అన్నప్రసాదాలు, అల్పాహారం, టీ, కాఫీ, పాలు, త్రాగునీరు సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పరిశీలించేలా అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ బృందం సభ్యులు పరిశీలించి, సమీక్షించుకుని ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవేకాకుండా సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేకప్రవేశ దర్శనాల ద్వారా కంపార్ట్‌మెంట్‌లకు చేరుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎన్ని గంటలకు అవుతోంది, ఎప్పటి నుండి వేచిఉన్నారనే విషయాలను సమీక్షించుకుని సౌకర్యంగా దర్శనం కల్పించేలా అధికారులతో కూడిన మరొక టీంను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా, కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేసే డిస్‌ప్లే బోర్డులను ఆయా ప్రాంతాలలోని అధికారులు నిరంతరం పరిశీలించి సరైన సమాచారాన్ని అందించాలన్నారు. తిరుమలలో మూడో దశ రింగ్‌ రోడ్‌ వెంబడి పచ్చదనం పెంచేలా విరివిగా మొక్కలను నాటాలని సూచించారు. తిరుమలలోని వ్యర్థ నీటిని శుద్ధి చేసి ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తిరుచానూరులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న శ్రీపద్మావతి నిలయంలో వసతి కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలన్నారు. భక్తులను మరింతగా ఆకట్టుకునేలా ఆలయాలలో ఎలక్ట్రికల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో జరుగుతున్న సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. టైంస్లాట్‌ సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేకప్రవేశ దర్శనం టోకెన్ల జారీ, దర్శన సమయం తదితర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్‌ జెట్టి, న్యాయాధికారి శ్రీ వెంకట రమణ నాయుడు, సర్వీసెస్‌ విభాగం డిప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, సిఈ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, డిఈవో శ్రీ రామచంద్ర, ఎస్టేట్‌ అధికారి శ్రీ విజయ సారధి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.