EO INSPECTIONS IN TIRUMALA_ తిరుమలలో టిటిడి ఈవో తనిఖీలు
By TTD News On 9 Aug, 2018 At 04:13 PM | Categorized As General News

Tirumala, 9 August 2018: TTD EO Sri Anil Kumar Singhal on Thursday inspected the Common Command Control Centre in PAC IV, Vaikuntham II scanning Center and ongoing arrangements for Astabandhana Balalaya Maha Samprokshanam in Tirumala temple along with CVSO In-charge Sri Siva Kumar Reddy,SE II Sri Ramachandra Reddy and other officers.

In PAC IV he thoroughly observed the operational network of Video Firewall which was set up at a cost of Rs.1.6crores. VGO Sri Ravindra Reddy explained him about the 32 screens which display all the CCTV footage. Later the EO inspected the latest Airport model scanners placed at VQC II.

The EO interacted reached the temple complex along with the general pilgrim queue line through VQC II and observed the arrangements for Maha Samprokshanam along with the chief priest Sri Venugopala Deekshitulu.

Health Officer Dr Sermista, SE Electrical Sri Venkateswarulu, EE I Sri Subramanyam were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో టిటిడి ఈవో తనిఖీలు

ఆగస్టు 09, తిరుమల 2018: తిరుమలలోని పిఏసి-4లో గల కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని స్కానింగ్‌ సెంటర్‌, శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గురువారం ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డితో కలిసి తనిఖీ చేశారు.

పిఏసి-4లోని కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో రూ.1.6 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన వీడియో వాల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో గల సిసిటివిల ఫుటేజిని ఇక్కడి 32 స్క్రీన్లలో వీక్షించి భద్రతాపరంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవచ్చని ఈ సందర్భంగా విజివో శ్రీ రవీంద్రారెడ్డి వివరించారు. అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో విమానాశ్రయాల భద్రతా వ్యవస్థ తరహాలో ఏర్పాటుచేసిన అధునాతన స్కానింగ్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆ తరువాత క్యూకాంప్లెక్స్‌లోని భక్తులతో ఈవో ముచ్చటించారు. టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలో జరుగుతున్న మహాసంప్రోక్షణ ఏర్పాట్లను ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులతో కలిసి ఈవో పరిశీలించారు.

ఈవో వెంట టిటిడి ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, ఇఇ-1 శ్రీ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `