EO INSPECTS AYUR COLLEGE _ ఆయుర్వేద వైద్య కళాశాల, ఆసుపత్రిని పరిశీలించిన ఈఓ

Tirupati, 15 Dec. 20: During his inspection to TTD run Sri Venkateswara Ayurvedic college in Tirupati TTD EO Dr KS Jawahar Reddy directed the officials concerned to come up with an action plan to develop the Ayurvedic institution.

Along with JEO Sri P Basanth Kumar, EO inspected Ayurvedic College on Tuesday evening. After going through the facilities available in the Ayurvedic institution, he directed the officials concerned to visit and observe the facilities available in Hassan, Belgaum Ayurvedic institutions in Karnataka which are top grade institutions in this ancient medicine system.

The EO instructed the Tirupati JEO to take up measures to fill up the vacancies on teaching side in the Institution. Later he also inspected the lab, Panchakarmasala, medicines store room, existing courses for the students and other amenities available to patients etc.and made necessary instructions to the college and hospital authorities to improve the facilities.

SV Ayurvedic College Principal and the in-charge Superintendent of the hospital Dr Padmavathi and other senior doctors were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆయుర్వేద వైద్య కళాశాల, ఆసుపత్రిని పరిశీలించిన ఈఓ

–  వసతుల కల్పన ఇతర అంశాలపై అధికారులకు ఆదేశాలు

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 15: శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల, ఆయుర్వేద ఆసుపత్రి లో  మరింత మెరుగైన సదుపాయాలు, సేవలు కల్పించడానికి ప్రణాళికలు తయారు చేయాలని టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

జెఈఓ శ్రీ బసంత్ కుమార్ తో కలసి మంగళవారం సాయంత్రం ఆయుర్వేద వైద్య కళాశాల, ఆసుపత్రి ని ఆయన పరిశీలించారు. వైద్య కళాశాల లోని వసతులు, అధ్యాపకుల ఖాళీలు, కోర్సుల వివరాలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో మంచి గ్రేడ్ లో ఉన్న హసన్, బెల్గాం ఆయుర్వేద వైద్య కళాశాలలను సందర్శించి అక్కడ అందిస్తున్న వైద్యసేవలు, సదుపాయాలు ఇతర అంశాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని జెఈఓ శ్రీ బసంత్ కుమార్ కు సూచించారు. కళాశాలను ఆర్థికంగా బలపరచే అంశాల గురించి పరిశీలించాలన్నారు. కళాశాలలోని ల్యాబ్ లను పరిశీలించి అనేక సూచనలు చేశారు.

వైద్య శాలలో  రోజువారీ రోగుల సంఖ్య,ఇన్ పేషంట్ల సంఖ్య అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్,పంచకర్మ శాల, మందుల స్టాక్ రూం పరిశీలించారు. ఆసుపత్రిని పూర్తిగా శానిటైజ్ చేసినందువల్ల అన్ని రకాల సేవలు అందించే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి తో పాటు పలువురు సీనియర్ వైద్యులు ఈఓ వెంట ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.