EO INSPECTS WORKS AT VONTIMITTA TEMPLE_ ఒంటిమిట్టలో కల్యాణవేదిక వద్ద త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌
By TTD News On 23 Mar, 2019 At 04:27 PM | Categorized As General News

Vontimitta, 23 Mar. 19: TTD Executive Officer Sri Anil Kumar Singhal today directed officials to focus on enhancing the architectural beauty of Sri Kodandarama Swamy Temple at Vontimetta in Kadapa district.

Inspecting the developmental works of Kalyanam Vedika at Vontimetta ahead of Sri Rama navami Brahmotsavam and Sitarama Kalyanam on April 18 along with JEO Sri Lakshmi Kantham, the EO said all works should be complete in time and the dwajasthambam should appear brighter.

He wanted officials to take colourful floral and electrical decorations in such a way that the wirings and the pillars should be covered completely. He also asked officials to promote a green landscape in the empty space between the temple, Kalyana mandapam and the Pushkarani and the compound wall removed to give huge congregation of devotees a whole some view of the colourful event.

Sri Singhal also released the wall posters and booklets of Sri Kodandarama Swamy Temple Brahmotsavam and Sri Rama Navami celebrations at Vontimetta.

The prominent events of Brahmotsavam are Dwajarohanam (April 13), Hanumantha Vahanam (April 16), Kalyanotsavam (April 18), Rathotsavam (April 19), and Chakra snanam on April 21.

TTD CVSO Sri Gopinath Jetty, Chief Engineer Sri Chandrasekhar Reddy, SE-1 Sri Ramesh Reddy, RDO Sri Naganna, DyEO Sri Natesh Babu, AEO Sri Ramaraju, Annaprasadam Spl Officer Sri Venugopal, Addl Health Officer Dr Sunil Kumar, Tourism officials etc. participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఒంటిమిట్టలో కల్యాణవేదిక వద్ద త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

మార్చి 23, ఒంటిమిట్ట, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 18న శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు కల్యాణవేదిక వద్ద అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల పనులను జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతంతో కలిసి శనివారం ఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయంలో శిల్ప సౌందర్యాన్ని భక్తులు దర్శించుకునేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ధ్వజస్తంభం మరింత కాంతివంతంగా కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయం, కల్యాణవేదిక వద్ద స్తంభాలు కనిపించకుండా ఆకర్షణీయంగా అలంకరణ చేయాలని సూచించారు. ఆలయంలో వైర్లు బయటకు కనిపించకుండా వైరింగ్‌ చేయాలన్నారు. ఆలయానికి, పుష్కరిణికి మధ్యగల స్థలాన్ని చదును చేసి ఆకట్టుకునేలా ఉద్యానవనం పెంచాలని ఆదేశించారు. రథమండపం, పుష్కరిణి మధ్యగల ప్రహరీని తొలగించాలన్నారు. పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులు కల్యాణాన్ని తిలకించేలా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని సూచించారు.

ఈవో వెంట టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-1 శ్రీరమేష్‌రెడ్డి, ఆర్డీవో శ్రీ నాగన్న, డెప్యూటీ ఈవో శ్రీ నటేష్‌బాబు, ఏఈవో శ్రీ రామరాజు, అదనపు ఆరోగ్య శాఖాధికారి డా.. సునీల్‌కుమార్‌, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లు ఆవిష్కరణ

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లను శనివారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. ఒంటిమిట్టలోని ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ఏప్రిల్‌ 13న ధ్వజారోహణం, ఏప్రిల్‌ 16న హనుమత్సేవ, ఏప్రిల్‌ 18న కల్యాణోత్సవం, ఏప్రిల్‌ 19న రథోత్సవం, ఏప్రిల్‌ 21న చక్రస్నానం జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు :

తేదీ ఉదయం రాత్రి

13-04-2019(శని) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల),(వృషభ లగ్నం) పోతన జయంతి, శేషవాహనం.

14-04-2019(ఆది) వేణుగాన అలంకారం హంస వాహనం

15-04-2019(సోమ) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం

16-04-2019(మంగళ) నవనీతకృష్ణ అలంకారం హనుమత్సేవ

17-04-2019(బుధ) మోహినీ అలంకారం గరుడసేవ

18-04-2019(గురు) శివధనుర్భంగాలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గజవాహనం.

19-04-2019(శుక్ర) రథోత్సవం —–

20-04-2019(శని) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం

21-04-2019(ఆది) చక్రస్నానం ధ్వజావరోహణం(రా|| 7 గం||)

22-04-2019(సోమ) ——– పుష్పయాగం(సా|| 6 గం||).

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v