EO PATS TTD EMPLOYEE’S SON FOR TOPPING CIVILS_ సివిల్స్‌లో విజయం సాధించిన టిటిడి ఉద్యోగి కుమారుడికి ఈవో అభినందన
By TTD News On 9 Apr, 2019 At 06:01 PM | Categorized As General News

Tirupati, 9 Apr. 19: TTD EO Sri Anil Kumar Singhal has complimented Sri M Naveen, son of TTD Assistant Engineer Sri M Munikrishnaiah who topped Civils Exam in 2018.

The father-son duo formally met TTD EO in his chambers in TTD Administrative Building in Tirupati on Tuesday. The EO also said that the children of other employees should get inspiration from Sri Naveen and aim high for Civil services.

Tirupati JEO Sri B Lakshmikantham and other senior officers also complimented Sri Naveen.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సివిల్స్‌లో విజయం సాధించిన టిటిడి ఉద్యోగి కుమారుడికి ఈవో అభినందన

ఏప్రిల్‌ 09, తిరుపతి, 2019: టిటిడి పరిపాలనా భవనంలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీఎం.మునికృష్ణయ్య కుమారుడు శ్రీ ఎం.నవీన్‌ 2018 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించినందుకు గాను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం అభినందించారు.

శ్రీఎం.మునికృష్ణయ్య తన కుమారుడు శ్రీ ఎం.నవీన్‌తో కలిసి మర్యాదపూర్వకంగా ఈవోను కలిశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇటీవల కాలంలో టిటిడి ఉద్యోగుల పిల్లలు ఐఏఎస్‌ సాధించడం ఇదే మొదటిసారి అన్నారు. శ్రీ నవీన్‌ను ఆదర్శంగా తీసుకుని మిగతా ఉద్యోగుల పిల్లలు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో రాణించాలని కోరారు. ఆ తరువాత శ్రీ ఎం.నవీన్‌ విద్యాభ్యాసం, పరీక్షలకు సన్నద్ధత, శిక్షణ, ఆప్షనల్‌ సబ్జెక్టు ఎంపిక, ఐఆర్‌టిఎస్‌లో శిక్షణ తదితర వివరాలను ఈవో అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా, శ్రీ ఎం.నవీన్‌ను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది అభినందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v