ESTIMATES COMMITTEE SERVES AND DINES AT MTVAC – LAUDS TTD SERVICES _ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన శాస‌నస‌భ అంచ‌నాల క‌మిటీ

Tirumala, 27 Nov. 19:The Estimates Committee constituted by Government of Andhra Pradesh visited Matrusri Tarigonda Vengamamba Annaprasada Bhavanam(MTVAC)on Wednesday evening.

The Chairman of the Committee Sri Rajanna Dora later talking to media persons appreciated the TTD Annaprasadam wing and also the services of Srivari Seva volunteers to the pilgrims.

He also wished to render service in Srivari Seva sometime soon. Later he interacted with the pilgrims who expressed immence satisfaction over the taste of Annaprasadam.

Later the committee chairman and members rendered Annaprasadam service to pilgrims and also dined in MTVAC.

Additional EO Sri AV Dharma Reddy,  Annaprasadam Wing DyEO Sri Nagaraju,  Reception DyEO Sri Balaji,  Catering Officer Sri GLN Shastry were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI



త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన శాస‌నస‌భ అంచ‌నాల క‌మిటీ

తిరుమ‌ల‌, 2019 న‌వంబ‌రు 27: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర శాస‌నస‌భ అంచ‌నాల క‌మిటీ బుధ‌వారం రాత్రి తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నాన్ని సంద‌ర్శించి అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించింది.

ఈ సంద‌ర్భంగా క‌మిటీ ఛైర్మ‌న్ శ్రీ పి.రాజ‌న్న దొర మీడియాతో మాట్లాడుతూ టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగాన్ని, శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. త్వ‌ర‌లో తాను కూడా శ్రీ‌వారి సేవ‌కు వ‌స్తాన‌ని చెప్పారు. అనంత‌రం ప‌లువురు భ‌క్తుల‌తో మాట్లాడ‌గా అన్న‌ప్ర‌సాదాల నాణ్య‌త, రుచిపై వారు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆ త‌రువాత క‌మిటీ ఛైర్మ‌న్‌, స‌భ్యులు ప‌లువురు భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజు, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.