EXPANSIVE DHARMA PRACHARAM THROUGH TTD WEBSITE_ టిటిడి వెబ్‌సైట్‌ ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచారం : తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
By TTD News On 17 Apr, 2019 At 06:04 PM | Categorized As General News

Tirupati, 17 Apr. 19: A comprehensive and focused dharma pracharam will be taken up through the SVBC, HDPP and the TTD website, said TTD Joint Executive Officer for Tirupati Sri B Lakshmi Kantham.

Speaking after a review meeting at the TTD administrative building on Wednesday, the JEO said, programs are structured in such a manner that in the first phase of action plan to reach about 30 lakh devotees across the world, be appraised of the Anna Prasadam, Kalyana Katta, Srivari Sevakulu, puja methods, importance of festivals at Srivari temple, through special documentaries on SVBC and TTD website.

He also advised officials to take action on grievances and suggestions from devotees on emails, WhatsApp and from call centre.

The JEO also said the admission process should be transparent and online at all TTD educational institutions on merit and quota basis and message of selections be delivered on line. He also directed officials for systematic training of archakas and dharmacharyas under the HDPP umbrella.

SVETA director Sri N. Muktheswara Rao, Transport GM and IT Head Sri Sesha Reddy, TTD DEO Sri Ramachandra, EDP OSD Sri Venkateswarlu Naidu and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి వెబ్‌సైట్‌ ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచారం : తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

ఏప్రిల్‌ 17, తిరుపతి, 2019: టిటిడి వెబ్‌సైట్‌తోపాటు హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఎస్వీబీసీ వెబ్‌సైట్ల ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచారం చేపడతామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో బుధవారం ఉదయం అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరికీ టిటిడి కార్యక్రమాలను చేరవేస్తున్నట్టు తెలిపారు. మొదటిదశలో 30 లక్షల మందికి ధర్మప్రచార కార్యక్రమాలను చేరువ చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాద వితరణ, కల్యాణకట్ట, శ్రీవారిసేవకుల విధులు- బాధ్యతలు, పూజా విధానాలు, పండుగల విశిష్టత తదితర అంశాలపై డాక్యుమెంటరీలు రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలన్నారు. టిటిడి కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫోన్‌ కాల్స్‌తోపాటు వాట్సాప్‌, ఈ-మెయిల్‌ ద్వారా వచ్చే సూచనలు, ఫిర్యాదులను సంబంధిత అధికారులను పంపి తక్షణం పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు.

టిటిడి విద్యాసంస్థల్లో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ ప్రవేశాలను పారదర్శకంగా నిర్వహించాలని, ఎంపిక సమాచారాన్ని విద్యార్థులకు తెలిపేలా ఏర్పాట్లు చేయాలని జెఈవో సూచించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో అర్చక శిక్షణ, ధర్మాచార్యుల శిక్షణను క్రమబద్ధంగా నిర్వహించాలన్నారు. టిసిఎస్‌తో సమన్వయం చేసుకుని టిటిడికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లను రూపొందించాలని ఐటి అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో శ్వేత సంచాలకులు శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీశేషారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ వెంకటనగేష్‌, డిపిపి కార్యదర్శి డా.. రమణప్రసాద్‌, విద్యాశాఖాధికారి శ్రీరామచంద్ర, ఇడిపి ఓఎస్‌డి శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v