FELICITATION PERFORMED TO OUTGOING TIRUPATI JEO_ శ్రీవారి అనుగ్రహంతోనే సుదీర్ఘకాలం సేవలందించాం : టిటిడి తిరుపతి పూర్వ జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 11 Feb. 19: Felicitation ceremony was performed in a grand manner to the outgoing TTD JEO for Tirupati, Sri P Bhaskar at Vengamamba Hall in SVETA Bhavan on Monday.

The Outgoing JEO Sri P Bhaskar Speaking on this occasion recalled.his sojourn as Tirupati Joint Executive Officer in TTD for 5years 4 months. I joined on October 11 in 2013. This is the longest part of my service in an organization and I am grateful to Lord Venkateswara and Goddess Padmavathi for showering their blessings upon me to serve in TTD”, he added.

The JEO said, if you put your 100 per cent effort sincerely, then you will achieve your goal. This is what I have done all through my career. I am thankful to all the love and cooperation you showered upon me during my successful stint in my TTD”, he maintained.

Earlier many Senior officers and Heads of various departments shared their working memories with Sri P Bhaskar and described him as an administrator with leadership qualities. They recalled the developments and initiatives hr brought in all the local temples, education institutions, ayurvedic hospital etc.

The religious staffs from Tirumala temple and other Tirupati temples offered Vedasirvachanam to the outgoing JEO Sri.P Bhaskar and his spouse Smt Amaravathi. Later felicitation was performed by various departments to the outgoing JEO Sri P Bhaskar in a grand manner.

The entire meeting was presided over by Smt Goutami, IAS(DyEO).

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారి అనుగ్రహంతోనే సుదీర్ఘకాలం సేవలందించాం : టిటిడి తిరుపతి పూర్వ జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2019 ఫిబ్రవరి 11: తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారిగా 5 సం|| 4 నెలల పాటు సుదీర్ఘకాలం స్వామివారి సేవలో సేవలందించినట్లు టిటిడి తిరుపతి తాజా మాజీ జెఈవో శ్రీపోల భాస్కర్‌ అన్నారు. శ్రీ పోల భాస్కర్‌ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం సోమవారం ఉదయం శ్వేతా భవనంలో ఘనంగా జరిగింది.

ఆత్మీయ వీడ్కోలు అందుకున్న శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే పలితాలు కలుగుతాయని, కావున ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలన్నారు. అందులో భాగంగా కష్టపడేవారిని ప్రోత్సహించాలని, ఇందులో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. శ్రీవారి ఆస్థానంలో 5 సంవత్సరాలా 4 నెలలు ఉద్యోగ బాధ్యతలను ఎంతో సంతృప్తిగా నిర్వహించానని, అంతే సంతోషంగా బదిలీపై వెళుతున్నానని పేర్కొన్నారు. టిటిడిలో అనేక విభాగాలు, భక్తుల సౌకర్యార్థం విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిపారు. మొత్తం సర్వీసు కాలాన్ని స్వామివారి నీడలో గడిపే టిటిడి ఉద్యోగులు అపరిమితమైన అదృష్టవంతులన్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన భక్తులకు నిస్వార్థ సేవలందించాలని కోరారు. ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి తనకు అన్ని విధాల సహకరించిన అధికారులకు, ఉద్యోగులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, విద్యాసంస్థల్లో బోధన నాణ్యత పెంపు తదితర అంశాల్లో శ్రీ పోల భాస్కర్‌ విశేష కృషి చేసినట్టు తెలిపారు. ప్రతి విషయంలోను సుదీర్ఘంగా చర్చించి, కార్యాచరణ రూపొందించి, విజయవంతం చేసేందుకు కృషి చేశారన్నారు.

టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం గురించి లెక్కచేయకుండా నిత్యం పనులు పూర్తి చేయడానికి కృషి చేశారన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అవసరమైన అనుమతులను గౌ|| ముఖ్యమంత్రివర్యుల దగ్గర మొదటి ప్రజెంటేషన్‌లోనే అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా కన్యాకుమారి, కురుక్షేత్ర, హైదరాబాదులలో శ్రీవారి శ్రీవారి ఆలయ నిర్మాణం తదితర పనులను సమర్థవంతంగా నిర్వహించినట్టు వివరించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి మాట్లాడుతూ విషయ పరిజ్ఞానం, అప్యాయత, కష్టపడేతత్వంతో ఉద్యోగులను ఒకతాటిపైకి తీసుకువచ్చి అభివృద్ధిని వేగవంతం చేశారన్నారు. ప్రతి కార్యక్రమాన్ని రూపొందించే సమయంలోనే అందులోని సమస్యలను పరిష్కరించి, కార్యాచరణ రూపొందించి విజయవంతం చేసే సవ్యచాచి శ్రీ పోల భాస్కర్‌ అని తెలిపారు.

టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు ప్రసంగిస్తూ హైందవ ధర్మప్రచారానికి పెద్దపీట వేసి జెఈవో పదవికే వన్నె తెచ్చారని కొనియాడారు. టిటిడి ప్రాజెక్టులను ఒకే గూటికి తీసుకురావడంలో విశేష కృషి చేసినట్లు తెలిపారు. టిటిడిలో ఐదు సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం అపూర్వ అవకాశమన్నారు.

టిటిడి డిఈవో శ్రీ రామచంద్ర మాట్లాడుతూ టిటిడి విద్యాసంస్థలలోని జూనియర్‌, డిగ్రీ, పిజి కోర్సుల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ప్రతిభ కలిగిన వారికి ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. టిటిడి ఉన్నత పాఠశాలలో ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 4 జతలు బట్టలు, పుస్తకాలు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. చదువు పూర్తికాగానే విద్యార్థులు ఉపాధి పొందేందుకు వీలుగా నైపుణాభివృద్ధిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారన్నారు.

టిటిడి ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి మాట్లాడుతూ టిటిడిలో ఐటి వేగవంతంచేసి సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలతో ఉత్తమ ఫలితాలు పొందేందుకు ముందుకు తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ- ఆఫీసు, హెచ్‌ఆర్‌మ్యాప్స్‌ ద్వారా పారదర్శకంగా, వేగంగా పాలన కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థచార్యులు మాట్లాడుతూ టిటిడిలోని అన్ని ప్రాజెక్టులను బలోపేతం చేసి కార్యక్రమాలను విస్తృతం చేసి, వేద విద్యకు విశేష కృషి చేసిన అభినవ శ్రీకృష్ణదేవరాయులని కొనియాడారు.

ముందుగా వేదపండితులు శ్రీ పోలభాస్కర్‌కు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు శాలువతో, శ్రీవారి చిత్రపట్టం, ప్రసాదంతో ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్ని విభాగాల అధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.