FLORAL TRIBUTES PAID AT VENGAMAMBA SAMADHI_ శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణి వెంగమాంబ : శ్రీ‌శ్రీ‌శ్రీ హ‌రిప్ర‌సాద్ స్వామీజీ
By TTD News On 17 May, 2019 At 07:23 PM | Categorized As General News

Tirumala, 17 May 19: On the occasion of 289th Jayanthi Celebrations of Matrusri Tarigonda Vengamamba, floral tributes were paid in Vengamamba Brindavanam located at Tirumala on Friday evening by the officials of Vengamamba Project of TTD.

Later the processional deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi reached Narayanagiri Gardens where Unjal Seva was performed.

Sri Hariprasad swamiji of Sri Vishnu Mohan Foundation rendered Anugraha Bhashyam and described Vengamamba as an ardent devotee of Lord Venkateswara and Lord Sri Lakshmi Narasimha Swamy who penned excellent works on both the deities.

Later the Annamacharya Project artistes rendered some excellent notes of Vengamamba and enthralled the devotees. Later the processional deities returned to the temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణి వెంగమాంబ : శ్రీ‌శ్రీ‌శ్రీ హ‌రిప్ర‌సాద్ స్వామీజీ

తిరుమల 2019 మే 17: శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించి ఆంతరంగిక భక్త శిరోమణిగా గుర్తింపు పొందారని చెన్నై టి.న‌గ‌ర్‌కు చెందిన శ్రీ విష్ణు మోహ‌న్ ఫౌండేష‌న్ శ్రీ‌పీఠాధిప‌తి శ్రీశ్రీశ్రీ హ‌రిప్ర‌సాద్ స్వామీజీ పేర్కొన్నారు. వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలు శుక్ర‌వారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ హ‌రిప్ర‌సాద్ స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామిని, శ్రీ బాలకృష్ణుడిని ఆరాధ్యదేవతలుగా వెంగమాంబ ఉపాసించారని తెలిపారు. వెంగమాంబ రచనలను సాక్షాత్తు శ్రీవారు అంగీకరించినట్టు వివరించారు. భారత, భాగవత, రామాయణాల తరహాలో వేంకటాచల మహత్యం అంతటి పవిత్రమైందని తెలిపారు. గోదాదేవి, వెంగమాంబ, మీరాబాయి భగవంతుడిని ఆరాధించిన విధానం ఒకే విధంగా ఉంటుందన్నారు. తిరుమలలో తుంబురు తీర్థం నుండి వచ్చే సమయంలో సాక్షాత్తు రామలక్ష్మణులు దారి చూపారని వెంగమాంబ తన రచనలో తెలియజేసిందన్నారు. 87 ఏళ్ల వయసులో శ్రీవారి ఆమోదంతో వెంగమాంబ సజీవ సమాధి అయ్యారని చెప్పారు. వెంగమాంబ చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తుల్లోని అంశాలను తెలుసుకోవచ్చన్నారు.

ముందుగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. సాయంత్రం 6.00 గంటలకు ఊంజల్‌సేవ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. ఈ కీర్తనలు భక్తులను అలరించాయి.

వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి :

తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో శుక్ర‌వారం సాయంత్రం టిటిడి అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, షేష్కార్ శ్రీ లోక‌నాథం, ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఇన్‌చార్జ్ సంచాల‌కులు శ్రీ విశ్వ‌నాధ్‌, ఏఈవో శ్రీ‌మ‌తి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ సూర్య‌నారాయ‌ణ‌రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v