FLORAL TRIBUTES TO SRI ADIBATLA NARAYANA DASA ON 153rd JAYANTHI CELEBRATIONS_ శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
By TTD News On 20 Aug, 2017 At 03:29 PM | Categorized As General News

Tirupati, 20 August 2017: The 153 birth anniversary of haridasa patriarch Sri Madajjada Adibhatla Narayana dasa was celebrated with the garlanding of the singer-saint at the Sri Venkateswara Music and Dance college campus this morning.

Students of the college led by Principal Smt YVS Padmavathi paid floral tributes and also chanted one of his popular keertan’s of the famed Haridasa.

The anniversary celebrations will be held for three days at Mahati Kalakrestram from 6pm in the evening under the aegis of the Sri Venkateswara Music and Dance college.

According to legend the child prodigy Narayana Dasa born at Ajjada village of Vizianagaram district in 1864 and exhibited exemplary talent in reciting Sanskrit verses- Sataka slokas- at the age of five itself. Famed as a contemporary Kalidasa Narayana dasa had scripted several epics like Savitri Charita, Janaki sapatham, Rukmini Kalyanam and Bhata Markandeya charitra. He was honored with the coveted title of Pancha Mukeswara for his versatality in Music, Literature and Vedic studies.

Among others prominent TTD officials and Faculty of SV Music College and students participated in the solemn event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2017 ఆగస్టు 20: హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాస 153వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి ఆదివారం కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, హరికథా విభాగాధిపతి శ్రీ ఎం.వి.సింహాచలశాస్త్రి పుష్పాంజలి సమర్పించారు. ఆనంతరం కళాశాల విద్యార్థులు బృందగానం నిర్వహించారు.

మూడు రోజుల పాటు సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.

నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాఠవాలు ప్రదర్శించేవారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించండంలో నారాయణదాసవర్యులు కాళిదాస మహాకవికి సమానమైనవారు. వీరు రచించిన హరికథా రచనలు, సాహిత్యగ్రంథాలు, సంగీతరూపకాలు కవి, గాయక, పండితులకు మనోజ్ఞమైన ఆనందాన్ని కలిగించాయి. ఈయన రచించిన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివి. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి. ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, ఇతర అధికార ప్రముఖులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am