FRIDAY GARDENS TURNS OUT TO BE MID SUMMER FOREST DREAM FOR THE DEVOTEES_ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
By TTD News On 17 May, 2019 At 07:54 PM | Categorized As Temple News

VASANTHOTSAVAM COMMENCES ON A GRAND NOTE IN TIRUCHANOOR

Tiruchanoor, 17 May 19: The annual Vasanthotsavams in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor commenced on a grand religious note in Tiruchanoor on Friday.

The maiden set up of forest laid by the Garden Wing of TTD in Friday Gardens in Tiruchanoor provided a cynosure to the eyes of devotees. The replica of deep forest woods with wild animals, flora, aves and reptiles attracted the devotees. After feeling the heat of scorching temperatures on Celcius scale, the Vasantha Mandapam decked in the Sukravarapu Tota provided a chill thrill feel to the devotees who converged to witness the Snapana Tirumanjanam of Goddess Padmavathi Devi.

The celestial fete was performed between 2.30pm and 4.30pm. This special fete is observed every year in the month of Vaisakha by the temple authorities for three days. All the evening arjitha sevas remained cancelled till May 19 following this spring festival. Meanwhile on May 18 there will procession of Swarna Ratham in Tiruchanoor in the morning.

Temple DyEO Smt Jhansi Rani and other temple staffs were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPAT

ప్ర‌కృతి ఒడిలో సేదతీరిన సిరుల‌త‌ల్లి

ప‌లు జంతువులు, ప‌క్షుల ఆకృతుల‌తో అడ‌విని త‌ల‌పించిన శుక్ర‌వార‌పు తోట‌

తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2019 మే 17: అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండనాయ‌కుడైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప‌ట్ట‌పుదేవేరి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు స‌మ‌స్త జీవ‌రాశుల‌కు అభ‌య‌మిచ్చే లోక‌మాత‌. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి. ప‌లుర‌కాల జంతువులు, ప‌క్షుల ఆకృతుల‌తో అడ‌విని త‌ల‌పించేలా తీర్చిదిద్దిన శుక్ర‌వార‌పుతోట‌లో శుక్ర‌వారం వేడుక‌గా వ‌సంతోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. మే 18న ఉదయం 7.11 నుండి 11 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

వైభవంగా స్నపనతిరుమంజనం

వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవం కార‌ణంగా శుక్ర‌వారం క‌ల్యాణం, ల‌క్ష్మీపూజ‌, ఊంజ‌ల్‌సేవ ర‌ద్ద‌య్యాయి.

శుక్ర‌వార‌పు తోట‌లో పుల‌కించిన ప్ర‌కృతి

శుక్ర‌వార‌పు తోట‌లోని మండ‌పం వ‌ద్ద ఏర్పాటు చేసిన సెట్టింగులు ప్ర‌కృతి ర‌మ‌ణీయ దృశ్యాలను క‌ళ్ల‌కు క‌ట్టాయి. అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తి వెనుక వైపు పురి విప్పిన నెమ‌లి పింఛం ఆక‌ట్టుకుంది. ఎండ వేడి నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగేలా మండ‌పం చుట్టూ వ‌ట్టివేర్ల‌ను ఏర్పాటుచేశారు. పచ్చ‌ని చెట్లపై రామ‌చిలుక‌లు, వాన‌రాలు, చెట్ల ప‌క్క‌నే జ‌ల‌పాతం, అక్క‌డే కొంగ‌లు, బాతులు ఉన్నాయి. అలాగే చెట్ల మ‌ధ్య‌లో ఏనుగు, ఆవుదూడ‌, పులి, సింహం, నెమ‌లి, జింక‌, పాము ఇత‌ర జంతువులు, ప‌క్షుల రూపాల‌ను తీర్చిదిద్దారు. ఈ స్న‌ప‌న మండ‌పం మొత్తాన్ని సంప్ర‌దాయపుష్పాలు, క‌ట్ ఫ్ల‌వ‌ర్ల‌తో అందంగా తీర్చిదిద్దారు. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి మాజీ స‌భ్యురాలు శ్రీ‌మ‌తి సుచిత్ర ఎల్లా స‌హ‌కారంతో టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ప‌ర్య‌వేక్ష‌ణలో సిబ్బంది ఈ మండ‌పాన్ని సుంద‌రంగా రూపొందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v