GODDESS PADMAVATHI RIDES COLOURFUL FLOAT_ తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం
By TTD News On 15 Jun, 2019 At 09:03 PM | Categorized As Temple News

Tiruchanoor, 15 Jun. 19:On the third day of ongoing annual Teppotsavam of Sri Padmavathi ammavari temple, Goddess Padmavathi rode majestically on colourful flat and blessed the devotees.

Earlier suprabatham, Sahasra namarchanaand nityarchanasevas were performed and later in the afternoon abhisekam was conducted to utsava idol of Goddess Padmavathi at the Nirada mandapam in the Padma Pushkarani.

On the grand float procession in the evening Goddess Padmavathi rode three rounds and later paraded on mada streets to bless the devotees.

On the fourth day of float festival tomorrow, Sunday, the Goddess will also go round the Pushkarani in the float .TTD has cancelled Kalyanotsavam, and unjal seva on Saturday.

DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, AVSO Sri Nandeeswar Rao, Superintendent Sri Gopalakrishna and other officials, archakas, devotees participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం

తిరుపతి, 2019 జూన్ 15: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడవ రోజైన శ‌నివారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5.00 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరుగనుంది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.

తిరుప‌తి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏవీఎస్వో శ్రీ నందీశ్వర్ రావు , సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణ‌, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v