GODDESS TAKES RIDE ON CHINNA SESHA VAHANAM _ చిన్నశేష వాహనంపై వెన్నకృష్ణుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

Tiruchanoor, 23 Nov. 19: Goddess Padmavati Devi, took the guise of Navaneeta Krishna and took celestial ride on  Chinna Sesha vahanam on Saturday evening.

The legend says that the Darshan of Goddess on Chinna Sesha Vahanam begets “Yoga Siddhi”.

Devotees thronged to witness the Goddess in her resplendent form and received the Divine blessings of the Universal Mother on the first Vahana Seva as a part of the Navahnika Karthika Brahmotsavams which commenced on Saturday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI



చిన్నశేష వాహనంపై వెన్నకృష్ణుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 23: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజు శనివారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు వెన్నకృష్ణుడి అలంకారంలో చిన్న‌శేష‌వాహ‌నంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుండి 11 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారిని దర్శించిన భక్తులకు యోగసిద్ధి చేకూరుతుంది.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఎస్విబిసి ఛైర్మన్ శ్రీ పృథ్వీరాజ్, టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కోలా శ్రీ‌నివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.