GOKULASHTAMI AT TIRUCHANOOR SRI KRISHNA TEMPLE _ తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో గోకులాష్టమి

Tiruchanoor, 12 Aug. 20: The festival of Gokulashtami was celebrated at the sub-temple of Sri Krishna Swamy in the Sri Padmavati Ammavari temple complex at Tiruchanoor on Wednesday in ekantham in view of COVID-19 restrictions.

After morning Nitya pujas of Archana and abhisekam, the utsava idols were given Snapana Tirumanjanam in the afternoon. Thereafter in the evening unjal Seva, Go puja and Gokulashtami Asthanam were conducted.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో గోకులాష్టమి
తిరుపతి, 2020 ఆగస్టు 12: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో బుధవారం గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా చేపట్టారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనంలో భాగంగా పలు రకాల సుగంధద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ అనంతరం  గోపూజ‌, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హిస్తారు.
అదేవిధంగా  ఆగస్టు 13న గురువారం ఉట్లోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.