GOVERNOR OF AP & TS HAD DARSHAN OF LORD VENKATESWARA_ శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌
By TTD News On 23 Apr, 2019 At 11:34 AM | Categorized As VIP News

Tirumala, 23 Apr. 19: HE Governor of AP & TS Sri E.S.L.Narasimhan accompanied by his Wife Smt Vimala Narasimhan offered prayers to lord Venkateswara inside Sri Vari Temple on Tuesday morning.

On his arrival at Sri Vari Temple, TTD EO Sri Anil kumar Singhal, Tirumala JEO Sri K S Sreenivasa Raju, welcomed the first citizen of the state while the priests with traditional Isthikaphal swagatham.

Later the highest dignitary of the state was led to the sanctum sanctorium where he offered prayers to sri venkateswara swamy. The vedic pundits offered vedasirvachanams to the Governor. Later TTD EO offered prasadams to the Governor.

Earlier following the temple tradition, the Governor had darshanam of swamy pushkarini and sri varahaswamy.

Suptd of Police Sri Anburajan, DyEO Sri Harindranath and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

ఏప్రిల్ 23, తిరుమల 2019: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్ మంగళవారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

గౌ|| గవర్నర్‌ దంపతులు క్షేత్ర సంప్ర‌దాయాన్ని పాటిస్తూ ముందుగా స్వామి పుష్క‌రిణిలో నీటిని ప్రోక్ష‌ణం చేసుకున్నారు. ఆ త‌రువాత శ్రీ భూవ‌రాహ‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తిరుమల జేఈవో శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అక్క‌డినుండి శ్రీవారి ఆలయానికి చేరుకున్నగౌ|| గవర్నర్‌ దంపతులకు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అర్చ‌కులు ఇస్తిక‌ఫాల్ స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| గవర్నరుకు వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి తీర్థప్రసాదాలతోపాటు స్వామి వారి చిత్రపటాన్ని వారికి ఈవో అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి శ్రీ‌వారి ఆల‌య డెప్యూటి ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ మనోహర్, ఓఎస్డి శ్రీ డాలర్ శేషాద్రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v