GRAND PROCESSION OF PEARL TALAMBRALU_ ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు
By TTD News On 15 Apr, 2019 At 12:55 PM | Categorized As Brahmotsavams, General News

Tirupati,15 April 2019: In connection with Sri Sita Rama Kalyanam in Sri Kodanda Rama Swamy temple in Tirupati, a procession of muthyala thalambralu was held from TTD administrative building to the temple on Monday.

Earlier special pujas were performed to the Pearl Thalambralu by TTD officials and Kakana bhattar Sri Anand Kumar Dikshitulu.

Tirumala Jeo Sri KS Sreenivasa Raju took part in the puja.

TTD FA and CAO Sri O Balaji, Addl.CVSO Sri Siva Kumar Reddy, DyEO Sri Sridhar, AEO Sri Thirumalaiah and others participated in the event. Employees also took part in the procession.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు

తిరుప‌తి, 15 ఏప్రిల్‌ 2019: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా టిటిడి పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో టిటిడి అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు ఏనుగుపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది.

శ్రీ కోదండ‌రామాల‌యం వ‌ద్ద టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు ముత్యాల తలంబ్రాల‌ను స్వీక‌రించారు. ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ 1984వ సంవత్సరం నుండి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను శ్రీకోదండరామాలయానికి తీసుకెళుతున్నట్టు తెలిపారు. సాయంత్రం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. ఏప్రిల్ 16న మంగళవారం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు రామాలయంలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరుగనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఏ అండ్‌ సిఏవో శ్రీ బాలాజి, అద‌న‌పు సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీ‌ధ‌ర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ జి.రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వై.రమేష్‌ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v