GRT BTU from May 11-19_ మే 11 నుండి 19వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
By TTD News On 25 Apr, 2019 At 03:12 PM | Categorized As Press Releases

Tirupati, 25 Apr. 19: The annual Brahmotsavams of Sri Govindarajaswamy Temple in Tirupati will be observed from May 11-19 with Ankurarpanam on May 10.

The main events includes Garuda vahanam on May 15, Rathotsavam on May18 and Chakrasnanam on May 19.

As per Agama traditions Koil Alwar Thirumanjanam will be performed on May 8 where the entire temple will he cleansed and prepared for annual brahmotsavams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI


మే 11 నుండి 19వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 ఏప్రిల్‌ 25: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

11-05-2019(శనివారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

12-05-2019(ఆదివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

13-05-2019(సోమవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
14-05-2019(మంగళవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

15-05-2019(బుధవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

16-05-2019(గురువారం) హనుమంత వాహనం గజ వాహనం

17-05-2019(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

18-05-2019(శనివారం) రథోత్సవం అశ్వవాహనం

19-05-2019(ఆదివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మే 8న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 8వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మే 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v