GUV OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌
By TTD News On 17 Dec, 2018 At 03:52 PM | Categorized As VIP News

Tirumala, 17 Dec. 18: The honourable Governor of twin Telugu states Sri ESL Narasimhan offered prayers in the temple of Sri Venkateswara Swamy in Tirumala on Monday.

Following the temple tradition, he first went to Swamy Pushkarini and then to Sri Bhu Varaha Swamy temple before visiting Tirumala shrine. He was accorded warm welcome with traditional Isthikaphal honours and received by Tirumala JEO Sri KS Sreenivasa Raju.

After offering prayers in the sanctum sanctorum he was rendered Vedasirvachanam by vedic scholars in Ranganayakula Mandapam.

Later the JEO presented him theertha prasadams along with 2019 TTD diaries and calendars.

CVSO Sri Gopinath Jatti, Urban SP Sri KKN Anburajan, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

డిసెంబ‌రు 17, తిరుమల 2018: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్ సోమ‌వారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గౌ|| గవర్నర్‌ దంపతులు క్షేత్ర సంప్ర‌దాయాన్ని పాటిస్తూ ముందుగా స్వామి పుష్క‌రిణిలో నీటిని ప్రోక్ష‌ణం చేసుకున్నారు. ఆ త‌రువాత శ్రీ భూవ‌రాహ‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్క‌డినుండి శ్రీవారి ఆలయానికి చేరుకున్నగౌ|| గవర్నర్‌ దంపతులకు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు, అర్చ‌కులు ఇస్తిక‌ఫాల్ స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| గవర్నరుకు వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి తీర్థప్రసాదాలతోపాటు 2019 డైరీ, క్యాలెండ‌ర్‌ను జెఈవో అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, తిరుప‌తి అర్బ‌న్ ఎస్‌పి శ్రీ అన్బురాజ‌న్‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటి ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v