GUV OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌
By TTD News On 5 Dec, 2018 At 11:47 AM | Categorized As VIP News

Tirumala, 5 Dec. 18: The honourable Governor of twin Telugu states Sri ESL Narasimhan offered prayers in the temple of Sri Venkateswara Swamy in Tirumala on Wednesday.

Following the temple tradition, he first went to Swamy Pushkarini and then to Sri Bhu Varaha Swamy temple before visiting Tirumala shrine. He was accorded warm welcome with traditional Isthikaphal honours and received by TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju.

After offering prayers in the sanctum sanctorum he was rendered Vedasirvachanam by vedic scholars in Ranganayakula Mandapam.

Later the EO presented him theertha prasadams, lamination photo of lord along with 2019 TTD diaries and calendars.

Speaking to media outside temple he expressed his immense satisfaction of having darshanam of lord venkateswara after a gap of one year. He said, after Maha Samprokshanam, the temple assumed a grand new look. He also lauded the efforts of TTD officials for their pilgrim initiative measures from time to time.

The new changes brought in the temple to showcase architectural marvel of the temple by removing glass and brass partitions has won the appreciation of the pilgrims, he added.

CVSO Sri Gopinath Jatti, Urban SP Sri KKN Anburajan, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌

డిసెంబర్ 05, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు.

గౌ|| గవర్నర్ ఇవాళ ఉదయం 7.45 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ వరహస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌ|| గవర్నర్ కు టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో ఆగమోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| గవర్నర్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వకుళామాతను, శ్రీ విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి హుండీలో కానుకలు చెల్లించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు. శ్రీవారి లడ్డూ, ప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని, 2019 ఏడాది క్యాలెండర్లు, డైరీలను టిటిడి ఈవో, తిరుమల జెఈవో వారికి అందించారు.

ఈ సందర్భంగా గౌ|| గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ రంగనాయక మండపంలో ఆర్కిటెక్చర్ కు ఇబ్బంది లేకుండా బయట నుండే చూసేందుకు వీలుగా చాలా బాగా లైటింగ్ ఏర్పాటు చేశారని అన్నారు. ధ్వజస్తంభాన్ని భక్తులు దూరం నుండే దర్శించుకునేలా చేశారని టిటిడి ఈవో, తిరుమల జెఈవోను అభినందించారు. అదేవిధంగా వైకుంఠఏకాదశి రోజున భక్తులు అందరూ శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి అర్భన్ ఎస్పీ అన్బురాజన్, డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, విజీవో శ్రీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `