HANUMANTHA VAHANAM ON APRIL 14, SRI RAMA PATTABHISHEKAM ON APRIL 15 IN TIRUMALA_ ఏప్రిల్ 14న హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్న శ్రీవారు
By TTD News On 23 Mar, 2019 At 04:30 PM | Categorized As Press Releases

Tirumala, 23 Mar. 19: On the occasion of Holy festival of Sri Rama navami celebrations at Srivari Temple, Tirumala Lord Rama will ride on Hanumantha vahanam on the mada streets and bless the devotees.

TTD is making elaborate arrangements for the Colourful event of Sri Rama Pattabhisekam on April 15.

On April 14 Snapana Thirumanjanam will be performed for the Utsava Idols of Sri Rama and his consorts Sri Sitarama, Lakshmana and Hanumanta at the Ranganayakula Mandapam and later at night the Sri Rama Navami Asthanam will be performed at the Bangaru vakili.

On April 15 the Colourful and glittering event of Sri Rama Pattabhisekam will be performed at the Bangaru vakili inside the Srivari Temple.

The TTD has cancelled the Vasantotsavam and Sahasra deepalankara sevas slated on April 14 and April 15 but other arjita sevas will continue as usual.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్ 14న హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్న శ్రీవారు

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 15న‌ శ్రీరామపట్టాభిషేకం

తిరుమల, 2019 మార్చి 23: ఏప్రిల్ 14వ తేది శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీమలయప్పస్వామివారు హనుమద్వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 15వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చనను ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.

కాగా రాత్రి 10.00 నుండి 11.00 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.

ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 8.00 గంటలకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా నిర్వహించే ఈ రెండు కార్యక్రమాలలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీ వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ఏప్రిల్ 15వ తేదీ శ్రీరామపట్టాభిషేక మహోత్సవం కారణంగా వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది. మిగిలిన ఆర్జిత సేవలు యదావిధిగా కొనసాగుతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v