GOLD MEDALS FOR 37th DHARMIC EXAM WINNERS- TTD CHAIRMAN_ సనాతన ధార్మిక పరీక్షల విజేతలకు బంగారు ప‌త‌కాలు : టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి

Tirupati, July 27, 2019: TTD plans to present gold medals to winners of the 37th Sanatana dharmic science exams conducted annually said TTD chairman Sri YV Subba Reddy said on Saturday.

Addressing a Executive Committee meeting of Hindu Dharma Prachara Parishad held at Sri Padmavathi Guest House, the chairman said that the TTD board decided to present Gold and silver medals to students from the district and state level who excelled in these tests in place of the certificates and cash awards given in the past.

He said combined first prize winner for both AP and Telangana would be presented a gold medal of 5 grams, 2 grams gold medal for second and one gram gold medal for the third prize winner at the state level.

Similarly, district level winners will get one gram Gold medal for first, 10 gram silver medal for second and 5gms silver for the third prize. Henceforth along with tests on dharma parichayam for 6,7,8 standard students, dharma praveshika tests will also be held for students not 9,10 standards.

He said the HDPP and Kanchi Kamakoti peetham would jointly conduct three day long Veda Parayanam, homam, Go Puja, Tulasi puja and Viruksha Puja In all 16 mandals Of Chittor District on a pilot project basis in 2019-20 as part of Sapthaham program.

The TTD has also agreed to pay a bus fare of 62 paise per km to all bhajan mandal artists of both AP and Telangana when they tour on programs.

He said the HDPP has been mandated to spread its activities under Managudi, Archaka shikshana, Sri Venkateswara Dharma Ratha Yatra, Shubhapradam, Sadacharam, Gita Jayanti, Pustaka Prasadam, Akhanda Harinama sankeertana etc.

Sri Prithvi Raj, the new chairman of SVBC paid a courtesy visit on the chairman Sri Reddy at the venue.

TTD Executive Officer, Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri P Basant Kumar, Endowments Commissioner Dr Padma, HDPP secretary Dr Ramana Prasad participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సనాతన ధార్మిక పరీక్షల విజేతలకు బంగారు ప‌త‌కాలు : టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి

తిరుప‌తి, 27 జూలై 2019: హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 37వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బంగారు, వెండి పథకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిటిడి ధర్మకర్తలమండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో శనివారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సంద‌ర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ గతంలో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రం, నగదు బహుమతి ఇచ్చేవారని, ఇకపై బంగారు, వెండి పత‌కాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి ప్రథమ బహుమతికి 5 గ్రాముల బంగారు పత‌కం, ద్వితీయ బహుమతికి 2 గ్రాముల బంగారు పత‌కం, తృతీయ బహుమతికి 1 గ్రాము బంగారు పత‌కం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలో స్థాయిలో ప్రథమ బహుమతికి 1 గ్రాము బంగారు పత‌కం, ద్వితీయ బహుమతికి 10 గ్రాముల వెండి పత‌కం, తృతీయ బహుమతికి 5 గ్రాముల వెండి పత‌కం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక 6,7,8 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం పరీక్షలు నిర్వహించేవారని, వీటితోపాటు ఇకపై 9,10 తరగతుల విద్యార్థులకు ధర్మప్రవేశిక పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

2019 – 20 సంవత్సరానికి హిందూ ధార్మిక ప్రచార పరిషత్, శ్రీ కంచి కామకోటి పీఠం సంయుక్తంగా చిత్తూరు జిల్లాలోని 16 మండలాలలో పైలెట్ ప్రాజెక్ట్ గా మూడు రోజుల పాటు వేద పారాయణం, హోమం, గోపూజ, తులసిపూజ, వృక్ష పూజ తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. హెచ్ డి పి పి ఆధ్వర్యంలో జరుగుతున్న సప్తాహం ( 7 రోజులు) కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ భజన మండళ్ల కళాకారులకు కిలో మీటరుకు 62 పైసలు చొప్పున సాధారణ బస్సు ఛార్జీలు చెల్లించేందుకు అంగీకరించామన్నారు. అదేవిధంగా హెచ్ డి పి పి ఆధ్వర్యంలో మనగుడి, అర్చక శిక్షణ, శ్రీవేంకటేశ్వర ధర్మ రథయాత్ర, శుభప్రధం, సనాతన ధార్మిక విజ్జాన పరీక్షలు, సదాచారం, గీతా జయంతి, భక్తులకు పుస్తక ప్రసాదం, అఖండ హరినామ సంకీర్తన తదితర కార్యక్రమాల ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచారం చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

అనంతరం ఎస్వీబీసీ బోర్డు కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఎస్వీబీసీ బోర్డు ఛైర్మెన్ గా నియమితులైన శ్రీ పృథ్వీరాజ్ మర్యాద పూర్వకంగా టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డిని కలిసారు.

ఈ కార్యవర్గ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పి. బసంత్ కుమార్, దేవాదాయ కమీషనర్ డా. పద్మ, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.