HE GOVERNOR OF AP & TELANGANA OFFERED PRAYERS TO GODDESS PADMAVATHI_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాప్ట్రాల గవర్నర్‌
By TTD News On 22 Apr, 2019 At 04:31 PM | Categorized As VIP News

Tiruchanur, 21 Apr. 19: HE Governor of Andhra Pradesh and Telangana Sri ESL Narasimhanan accompanied by wife Smt. Vimala Narasimhanan had darshan of Goddess Padmavathi in Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on monday evening. On his arrival at Temple DyEO Smt Jhansi Rani and temple priests welcomed him with temple honors. After darshan of the Goddess DyEO presented Ammavari Prasadam.

Dist Collector Sri Pradhyuma, Joint Collector Sri PS Gireesha, Uraban SP Sri Anburajan, Temple priests and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాప్ట్రాల గవర్నర్‌

తిరుపతి, 2019 ఏప్రిల్ 22: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలుగు రాప్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ దంపతులు సోమ‌వారం మ‌ధ్యాహ్నం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా గౌ|| గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు బాగా కుర‌వాలని, పాడిపంట‌ల‌తో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాల‌ని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌ దంపతులకు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. గవర్నర్‌ దంపతులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆలయ ఏఈవో శ్రీసుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీమతి మల్లీశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v