తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 1.96 కోట్లు

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 1.96 కోట్లు

తిరుమల, 2019 జూలై 18: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలం గురువారం నిర్వ‌హించారు. త‌ద్వారా టిటిడి రూ. 1.96 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ఇందులో భాగంగా తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు) టిటిడి ఈ-వేలం నిర్వహించారు. ఈ-వేలంలో మొత్తం 900 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

మొదటి ర‌కం తలనీలాలు కిలో రూ.22,508/-గా ఉన్న 500 కిలోలను వేలానికి ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.127.25 లక్షల ఆదాయం సమకూరింది.

రెండో రకం తలనీలాలు కిలో రూ.17,260/-గా ఉన్న 25,300 కిలోలను వేలానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.69.04 లక్షల ఆదాయం సమకూరింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.