టిటిడి పరిపాలనా భవనంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
By TTD News On 13 Aug, 2017 At 04:23 PM | Categorized As Press Releases

టిటిడి పరిపాలనా భవనంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2017 ఆగస్టు 13: భారత స్వాతంత్య్ర దినం ఆగస్టు 15న నిర్వహించే వేడుకలకు టిటిడి సిద్ధమవుతోంది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. మంగళవారం ఉదయం 7.00 గంటలకు పంద్రాగస్టు వేడుకలు ప్రారంభమవుతాయి. జెండా వందనం అనంతరం టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన మొత్తం 137 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. చివరగా టిటిడి విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `