ఆగష్టు 7, 8 తేదీలలో జమ్మలమడుగులోని టిటిడి ఆలయ వ్యవసాయ భూమి కౌలు / లీజుకు వేలం

ఆగష్టు 7, 8 తేదీలలో జమ్మలమడుగులోని టిటిడి ఆలయ వ్యవసాయ భూమి కౌలు / లీజుకు వేలం

తిరుపతి, 2018 ఆగష్టు 03: టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా జమ్మలమడుగు దేవాలయంకు చెందిన 42.41 ఎకరాల వ్యవసాయ భూమిని జూలై 2019 – 2020 సంవత్సరానికి గాను కౌలు / లీజుకు ఇవ్వడానికి వేలం వేయనున్నారు. ఈ భూములను కౌలుకు తీసుకునేందుకు ఆసక్తియున్న వారి నుండి సీల్డు టెండర్లు ఆహ్వానించడమైనది. జమ్మలమడుగు, కన్నేలురు, దేవగుడి, పెద్దపసుపుల, గొరిగనూరు, దొమ్మరనంద్యాల, మొరగుడి గ్రామాలలోని వ్యవసాయ భూములను ఆగష్టు 7, 8 తేదిలలో ఉ. 11 గంటలకు టెండర్ సహిత వేలం పాట వేయబడును.

టెండరు ధరఖాస్తులు కావలసిన వారు కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి పేరిట రూ.224 డిడిని తీసుకోవాలి. వేలము ప్రారంభించే ముందు వరకు డిడిలను సమర్పించి సహాయ కార్యనిర్వహణాధికారి (రెవెన్యూ), టిటిడి పరిపాలన భవనము, తిరుపతి వద్ద లేదా టెంపుల్ ఇన్ స్పెక్టర్, శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి దేవాలయము, జమ్మలమడుగు వారి నుండి ధరఖాస్తులు పొందవచ్చు. వ్యవసాయ భూమి విస్తీర్ణం బట్టీ టిటిడి నిర్ణయించిన ఇ.ఎం.డి కొరకు ఆయా డిడిలను జత చేయాలి. నింపబడిన సీల్డు టెండరు ఫారములు వేలము he’ ప్రారంభించే ముందు వరకు స్వీకరించబడును.

ఇతర వివరాలకు ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి ఆలయ డిప్యూటీ కార్యాలయం అధికారులను సంప్రదించవలెను.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.