ఏప్రిల్‌ 26న ”భక్తులతో భవదీయుడు ”
By TTD News On 25 Apr, 2019 At 06:31 PM | Categorized As Press Releases

ఏప్రిల్‌ 26న ”భక్తులతో భవదీయుడు ”

ఏప్రిల్‌ 25, తిరుపతి, 2019: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఏప్రిల్‌ 26వ తేదీన ”భక్తులతో భవదీయుడు” కార్యక్రమం జరుగనుంది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటారు. భక్తులు ఫోన్‌ ద్వారా నేరుగా జెఈవో గారికి సూచనలు, సలహాలు అందించవచ్చు. ప్రతినెలా మూడో శుక్రవారం ఈ కార్యక్రమం జరుగనుంది. ఐతే, ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో ఈ నెల మూడో శుక్రవారం బదులు నాలుగో శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు : 0877-2234777.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం తదితర టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, సత్రాల్లో సౌకర్యాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడమైనది. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశముంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v