JEO H & E INSPECTS TTD PROPERTIES _ టిటిడి ఆస్తులను పరిశీలించిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 13 Oct. 20:The Joint EO for Health and Education, Smt Sada Bhargavi inspected the TTD properties located in and around Tirupati on Tuesday evening.

As part of it, she visited Cancer Care Centre,  road extension works between Alipiri and Zoo park,  Ayurveda Pharmacy, Nursery, Police Training Centre near Kalyani Dam and made some instructions regarding works to the officials concerned.

Estates Officer Sri Mallikarjuna,  DFO Sri Chandrasekhar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఆస్తులను పరిశీలించిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి
తిరుపతి, 2020 అక్టోబర్ 13: తిరుపతి, పరిసర ప్రాంతాల్లో గల టిటిడి ఆస్తులను మంగళవారం జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి పరిశీలించారు.
అలిపిరి పాత చెక్ పాయింట్, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్, అలిపిరి నుండి ఎస్వీ జూ పార్క్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, నరసింగాపురంలోని ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ, నర్సరీ, కళ్యాణి డ్యామ్ వద్ద గల పోలీస్ ట్రైనింగ్ కళాశాల తదితర ప్రాంతాలను జెఈఓ పరిశీలించారు. ఆయా ఆస్తుల వద్ద ప్రస్తుత పరిస్థితిని గమనించి నిర్వహణ మెరుగ్గా ఉండేలా అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈఓ వెంట టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున, డిఎఫ్ఓ శ్రీ చంద్రశేఖర్, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.