JEO ( HEALTH & EDUCATION) INSPECTS TTD GARDENS _ టిటిడి ఉద్యానవనాలను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 20 Oct 20: TTD Joint Executive Officer Smt Sada Bhargavi on Tuesday inspected all the gardens under TTD  and gave valuable instructions on their maintenance to officials.

Initially she inspected the TTD Garden department at the TTD administrative buildings and the TTD garden nursery at Pitchinaidupalli.

Later she visited the vacant space at the Sri Padmavati women Degree college and Sri Padmavati women’s polytechnic college and studied feasibility of promoting green landscape there and gave specific instructions to officials of TTD garden department.

TTD additional health officer Dr Sunil Kumar and Farm Manager Sri Janardhan  Reddy  and other officials were present in the inspection tour.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఉద్యానవనాలను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి
తిరుపతి, 2020 అక్టోబర్ 20: తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో గల ఉద్యానవనాలు, నర్సరీలను జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి మంగళవారం  పరిశీలించారు.
టిటిడి పరిపాలన భవనంలో గల ఉద్యానవన విభాగం, తిరుపతి సమీపంలోని పిచ్చినాయుడుపల్లిలోని టిటిడి గార్డెన్ నర్సరీని తనిఖీ చేశారు. అదేవిధంగా, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో నర్సరీల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. అనంతరం ఉద్యానవనాలు, నర్సరీల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈఓ వెంట టిటిడి అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఫామ్ మేనేజర్ శ్రీ జనార్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.