JEO INSPECTS SRINIVASAM_ శ్రీ‌నివాసంలో టిటిడి తిరుపతి జెఈవో త‌నిఖీలు
By TTD News On 16 Feb, 2019 At 06:42 PM | Categorized As General News

Tirupati, 16 Feb. 19: TTD JEO Sri B Lakshmikantham, on saturday evening inspected Srinivasa rest house in Tirupati.

He interacted with the pilgrims who are residing in the rooms and enquired about the amenities being provided to them by TTD like annaprasadam, jalaprasadam, slotted sarva darshanam tokens etc.

Later speaking to media persons he said, the pilgrims expressed immense satisfaction over the maintenance of accommodation in Srinivasam complex. However, he said, if any online booking was cancelled, the allotment should be made to the pilgrim waiting for accommodation without any delay. “A team has been constituted to further enhance the facilities. A review meeting with the officials concerned will be conducted in couple of days to discuss the issues if any”, he maintained.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ‌నివాసంలో టిటిడి తిరుపతి జెఈవో త‌నిఖీలు

తిరుపతి, 2019 ఫిబ్రవరి 16: టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం శ‌నివారం సాయంత్రం తిరుప‌తిలోని శ్రీ‌నివాసం యాత్రికుల వ‌స‌తి స‌ముదాయంలో త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఇక్క‌డి వ‌స‌తి గ‌దుల్లో బ‌స చేస్తున్న యాత్రికుల‌తో మాట్లాడారు. టిటిడి అందిస్తున్న అన్న‌ప్ర‌సాదం, జ‌ల‌ప్ర‌సాదం, టైంస్లాట్ టోకెన్లు త‌దిత‌ర సౌక‌ర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌నివాసంలో బ‌స ఏర్పాట్లు చ‌క్క‌గా ఉన్నాయ‌ని యాత్రికులు సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిపారు. యాత్రికులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న గ‌దులను ర‌ద్దు చేసుకున్న‌ట్ల‌యితే వెంట‌నే అక్క‌డ వేచి ఉన్నవారికి ఆ గ‌దులు కేటాయించాల‌ని అధికారుల‌కు సూచించిన‌ట్టు చెప్పారు. ఇక్క‌డ మ‌రిన్ని వ‌స‌తులు పెంచేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు. యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాల్లో సౌక‌ర్యాల పెంపుపై చ‌ర్చించేందుకు సంబంధిత అధికారుల‌తో త్వ‌ర‌లో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

జెఈవో వెంట శ్రీ‌నివాసం డెప్యూటీ ఈవో శ్రీ చెంగ‌ల్రాయ‌లు త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v