JEO INSPECTS TTD CHOULTRY AND INFORMATION CENTRE IN CHENNAI_ చెన్నైలోని టిటిడి ధర్మశాల, సమాచార కేంద్రంలో జెఈవో తనిఖీలు
By TTD News On 24 Apr, 2019 At 06:47 PM | Categorized As General News

Tirupati, 24 Apr. 19: The Joint Executive Officer of TTD for Tirupati Sri B Lakshmi Kantham Inspected the TTD run choultry at Royapettah and Information Centre at T Nagar and the Sri Padmavathi temple which is coming up at Chennai and inquired about the amenities to devotees.

Speaking on the occasion, the JEO said that the officials were directed to improve the quality of devotee friendly amenities in the VVR Choultry, besides improving, cleanliness, and power supply and drinking water facilities. He said TTD is also aimed to take up repainting, repairs and greenery in its buildings.

Later the JEO also visited the TTD information centre at T.Nagar and Sri Padmavathi temple where he inspected the registers of jewellery, donors and padi kavali and directed officials to make entries regularly in a prompt manner. At the information Centre and e-darshan counters he instructed them for painting and flooring. He asked officials to keep new portraits of dieties in the meditation hall. The JEO also urged officials to provide drinking water and other basic amenities to devotees in the TTD offices.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చెన్నైలోని టిటిడి ధర్మశాల, సమాచార కేంద్రంలో జెఈవో తనిఖీలు

ఏప్రిల్‌ 24, తిరుపతి, 2019: చెన్నై రాయపేటలోని వివిఆర్‌ ధర్మశాల, టి.నగర్‌లోని టిటిడి సమాచార కేంద్రం, శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. చెన్నై రాయపేటలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిఆర్‌ ధర్మశాల, టి.నగర్‌లోని సమాచార కేంద్రాని బుధవారం జెఈవో అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ చెన్నై రాయపేటలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిఆర్‌ ధర్మశాలలో గదులలో మరింత మెరుగైన సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌, తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ధర్మశాలలో బెడ్‌షీట్లు, దిండుకవర్లు ఎప్పటికప్పుడు మార్చాలని, భవనానికి పెయింటింగ్‌, అవసరమైన మరమ్మతులు చేపట్టి భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలన్నారు. పచ్చదనం పెంచి ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

అనంతరం టి.నగర్‌లోని సమాచార కేంద్రం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరువాభరణం, పడికావలి, దాతల రిజిష్టర్‌ల నిర్వహణను పరిశీలించారు. ఈ-దర్శన్‌ కేంద్రం, సమాచార కేంద్రంలో ఫ్లొరింగ్‌, పెయింటింగ్‌ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రార్థన మందిరంలోని దశావతరాల విగ్రహాల సుందరీకరణ, పాత ఫోటోల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v