JEO INTERACTS WITH PWFS VOLUNTEERS_ పిడబ్ల్యుఎఫ్ఎస్ సేవ‌కుల‌తో జెఈవో స‌మావేశం
By TTD News On 15 Apr, 2019 At 05:15 PM | Categorized As General News

Tirumala, 15 Apr. 19: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Monday interacted with the Sri Vari Seva volunteers deployed for Pilgrim Welfare Facilitation Service(PWFS).

Addressing them in Seva Sadan Satsang hall he said the chief motto behind PWFS is to ensure whether all the amenities that are being provided by TTD are properly reaching them or not.

Later the volunteers who were deployed in different shifts shared their feedback while some better methods to improve the facilities.

While appreciating their services, JEO asked them to act as keen observers and ensure proper distribution of food, beverages, milk to infants and children, the release of compartments on time, sanitation, etc.

He instructed the Srivari Seva officials to consolidate the feedback and make into a report for betterment of the system. He also directed them to give a route map and area based duty chart to extract better services from them.

Earlier he inspected VQC 2 to monitor the services of PWFS volunteers.

TTD PRO and Seva Sadan Head Dr T Ravi, APRO Ms P Neelima, AE Sri Vara prasad and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పిడబ్ల్యుఎఫ్ఎస్ సేవ‌కుల‌తో జెఈవో స‌మావేశం

ఏప్రిల్ 15, తిరుమ‌ల‌, 2019: యాత్రికుల సంక్షేమ సేవా విధులు (పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఫెసిలిటేష‌న్ స‌ర్వీస్) కేటాయించిన శ్రీ‌వారి సేవ‌కుల‌తో సోమ‌వారం టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు స‌మావేశం నిర్వ‌హించారు.

శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌లోని స‌త్సంగం హాల్లో జ‌రిగిన స‌మావేశంలో జెఈవో మాట్లాడుతూ టిటిడి క‌ల్పిస్తున్న అన్ని సౌక‌ర్యాలు భ‌క్తుల‌కు చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవ‌డ‌మే ఈ సేవ ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు సేవ‌కులు మాట్లాడుతూ యాత్రికుల‌కు మ‌రింత మెరుగ్గా సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఉన్న మార్గాల‌ను తెలియ‌జేశారు. ఈ సేవావిధులు నిర్వ‌హిస్తున్న సేవ‌కుల‌ను ఈ సంద‌ర్భంగా జెఈవో ప్ర‌శంసించారు. సేవ‌కులు ప‌రిశీల‌కులుగా వ్య‌వ‌హ‌రించి కంపార్ట్‌మెంట్ల‌లోని యాత్రికుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, టి, కాఫి, చంటిపిల్ల‌ల‌కు పాలు స‌క్ర‌మంగా అందేలా, కంపార్ట్‌మెంట్లు స‌మ‌యానికి వ‌దిలేలా, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాల‌ని కోరారు. ఈ సేవ‌కుల ఫీడ్‌బ్యాక్‌ను క్రోడీక‌రించి ఒక నివేదిక రూపొందించాల‌ని శ్రీ‌వారి సేవ అధికారుల‌ను జెఈవో ఆదేశించారు.

అంత‌కుముందు ఉద‌యం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను, శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను జెఈవో ప‌రిశీలించారు. ప‌లువురు భ‌క్తుల‌తో ముచ్చ‌టించి సౌక‌ర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v