JEO REVIEWS ARRANGEMENTS FOR BTUs AT APPALAYAGUNTA_ అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలపై జెఈవో స‌మీక్ష‌

Tirupati, 10 Jun. 19: TTD Joint Executive Officer for Tirupati Sri B Lakshmikantham reviewed on the arrangements for the annual Brahmotsavams of Sri Prasanna Venkateswara temple at Appalayagunta scheduled from June 13-21.

Speaking after meeting at the TTD administrative building on Monday the JEO said Koil Alwar Tirumanjanam event will be held on June 11, Dwajarohanam in Karkataka lagnam on June 13.

The schedule of events includes Kalyanotsavam on June 16, Garuda vahanam June 17, Rathotsavam on June 20, Chakra Snanam on June 21.

The JEO directed officials to ensure drinking water supply and remove all hurdles in the Mada streets, clear parking areas and avoid traffic snarls.

ADEQUATE ARRANGEMENTS FOR TEPPOTSAVAM AT SRI PAT

The JEO, Tirupati Sri B Lakshmikantham also advised TTD officials to make elaborate arrangements for the five-day holistic event of Teppotsavam at Sri Padmavathi Ammavari temple, Tiruchanoor from June 13-17.

He appealed to devotees to participate in the daily float ceremony in the Padma Sarovaram. On the first day, the Goddess will adorn avatar of Rukmini, Sathyabama with Sri Krishna, Sri Sundararaja on the second day and as Goddess Padmavathi on last three days.

He said on last three days Snapana Tirumanjanam will be performed to the utsava idols at the Niratotsava Mandapam in the middle of Padma Sarovaram. Other events include Gaja vahanam on June 16 night, Garuda vahanam on June 17.

He directed officials to put up barricades, security, sanitation, Medicare, Electrical and flower decorations in a grand manner.

Spl.Gr.DyEO Smt Varalakshmi, DyEO Smt Jhansi Rani, VSO Sri Ashok Kumar Goud, EE Sri Satyanarayana, DE Sri K Chandrasekhar, Additional Health Officer Dr Sunil Kumar and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలపై జెఈవో స‌మీక్ష‌

తిరుపతి, 2019 జూన్ 10: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 13 నుండి 21వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల‌పై టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ స‌మావేశం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జూన్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంద‌న్నారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. జూన్ 13న గురువారం ఉద‌యం 10 నుండి 10.30 గంట‌ల మ‌ధ్య కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం జ‌రుగ‌నుంద‌ని, ఆ త‌రువాత జూన్ 16న కల్యాణోత్సవం, జూన్ 17న గరుడసేవ‌, జూన్ 20న ర‌థోత్స‌వం, జూన్ 21న చ‌క్ర‌స్నానం జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. భ‌క్తుల‌కు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, ఆల‌య మాడ వీధుల్లో ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించాల‌ని, పుష్క‌రిణిని ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని, పార్కింగ్ ప్ర‌దేశాల‌ను సిద్ధం చేయాల‌ని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 13 నుండి 17వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరుగనున్న వార్షిక తెప్పోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీసుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారని తెలిపారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తామని వివరించారు. అమ్మవారికి జూన్ 16వ తేదీ రాత్రి గజవాహనం, 17వ తేదీ రాత్రి గరుడ వాహనసేవలు వైభవంగా జరుగనున్నాయని జెఈవో తెలియజేశారు. భ‌క్తుల కోసం బారీకేడ్లు ఇత‌ర భ‌ద్ర‌త ఏర్పాట్లు, మెరుగైన పారిశుద్ధ్యం, వైద్య సౌక‌ర్యం, విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, విస్తృత ప్ర‌చారం చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఇఇ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, డిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డా..సునీల్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.