JEO REVIEWS ON ARRANGEMENTS FOR SRI KRT TEMPLE BTU_ శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష
By TTD News On 22 Mar, 2019 At 08:59 PM | Categorized As General News

Tirupati, 22 Mar. 19: TTD Joint Executive Officer Sri B Lakshmi Kantham today reviewed the elaborate arrangements for the smooth conduct of Brahmotsavam of Sri Kodandarama Swamy Temple from April 3 to April 11.

After reviewing preparations with officials of all departments the JEO urged them to strive and make the Sri Rama Navami festival from April 14-16 and annual Teppotsavam from April17-19 a grand success with attractive paintings and rangoli.

The JEO instructed the officials to keep the vahanams, ropes and Rathaus in readiness, and organise bhajan teams, kolatas, and Bhakti sangeet in front of vahanam and also water the mada streets in advance. He also wanted officials to make attractive electrical and floral decorations and give adequate advance publicity to the event

He also advised them to arrange for primary healthcare, live telecast through SVBC, enrol adequate number of Srivari Sevakulu, Ramakoti devotees, barricades, supply of Annaprasadam, buttermilk and drinking water packets, besides focus on cleanliness.

TTD SE-1 Sri Ramesh Reddy, Spl Gr DyEO Smt Varalakshmi, DyEOs Sri EC Sridhar and Smt Jhansi Rani, VSO Sri Ashok Kumar Goud, Transport GM Sri Sesha Reddy, DFO Sri Phanikumar Naidu, AEO Sri K Thirumalaiah and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

తిరుపతి, 2019 మార్చి 22: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం సాయంత్రం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాధిపతులతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 11వ తేదీన చక్రస్నానంతో ముగియనున్నాయని తెలిపారు. అలాగే ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ తెప్పోత్సవాలు జరుగనున్నాయని వివరించారు. ఆల‌యంలో ఆక‌ట్టుకునేలా పెయింటింగ్స్‌, రంగ‌వ‌ళ్లులు తీర్చ‌దిద్దాల‌ని సూచించారు. వాహ‌నాల ప‌టిష్ట‌త‌ను, తండ్ల‌ను ముంద‌స్తుగా త‌నిఖీ చేయాల‌న్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు భక్తులను ఆకట్టుకునేలా భజనలు, కోలాటాలు, ఇతర కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు. మాడ వీధుల్లో నీటిని పిచికారీ చేసి భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. ప్ర‌చార ర‌థాల‌ను సిద్ధం చేసి తిరుప‌తి, ప‌రిస‌ర ప్రాంతాల్లో విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని సూచించారు. బ్రహ్మోత్సవాల శోభను తెలిపేరీతిలో ఆలయ పరిసర ప్రాంతాలలో విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంకరణలు ఘనంగా ఏర్పాటు చేయాలన్నారు.

భ‌క్తుల కోసం ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేయాల‌ని, ఎస్వీబీసీ ద్వారా వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయాల‌ని జెఈవో ఆదేశించారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ర‌ప్పించాల‌న్నారు. భక్తులు రామకోటి రాసేందుకు వీలుగా పుస్త‌కాలు అందించాలన్నారు. భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు బారీకేడ్లు ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయాలని, తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, ప్ర‌త్యేక శ్రేణి డ్యెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, డెప్యూటీ ఈవోలు శ్రీ ఇసి.శ్రీ‌ధ‌ర్‌, శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, ఏఈవో శ్రీ తిరుమ‌ల‌య్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v