JYESTABHISHEKAM FESTIVAL FROM JUNE 24 TO JUNE 26 IN TIRUMALA_ తిరుమలలో జూన్‌ 24 నుండి 26వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం
By TTD News On 4 Jun, 2018 At 07:59 PM | Categorized As Events, Press Releases

Tirumala, 4 June 2018: A Three day traditional festival of Jyestabhisekam will be performed in the Srivari Temple as per annual ritual in the month of Jyesta month and and end of Jyesta nakshatram.

The festival being conducted at the Kalyana mandapam within the Sampangi pranganam is also refered to as ‘Abhidyeyaka Abhisekham’.

The festival aimed at preservation of the age-old and archaic utsava idols of Lord Malayappa swamy from aging and other deficiancies. On Day-one the golden cover of the idols are removed and abhisekam and homas are performed to the utsava murthis with panchamruta snapana thirumanjanam and taken out in procession after giving it a diamond body cover. On Day 2 the idols are covered in cover made of pearls and on Day-3 the idols are once again adorned with gold cover. The goldcover is replaced again next year when the Jyestabhisekam is performed.

TTD has cancelled all the arjita sevas in the Srivari temple from June 24- Vasantotsavam, Vishesha puja on June 25 and Vasantotsavam and on June 26- Astadalapada Padmaradhana, Kalyanotsavam, Unjal seva, Arjita Brahmotsavam and Vasantotsavam. All the Tomala seva and Archana sevas will be conducted in Ekantham.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో జూన్‌ 24 నుండి 26వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం

జూన్‌ 04, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్‌ 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని ”అభిద్యేయక అభిషేకం” అని కూడా అంటారు.

కొన్ని సంవత్సరాలుగా అభిషేకాది క్రతువులతో అత్యంత ప్రాచీనములైన శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఏర్పాటుచేసిన ఉత్సవమే ఇది.

మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహించిన తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.

రెండో రోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.

ఆర్జితసేవలు రద్దు :

జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్‌ 24న వసంతోత్సవం, జూన్‌ 25న విశేషపూజ, వసంతోత్సవం, చివరిరోజైన జూన్‌ 26న అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. కాగా తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `