KALYANA VENKANNA AS DARBAR KRISHNUDU RIDES CHANDRA PRABHA VAHANAM _ చంద్రప్రభ వాహనంపై దర్బార్‌ కృష్ణుని అలంకారంతో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

KALYANA VENKANNA AS DARBAR KRISHNUDU RIDES CHANDRA PRABHA VAHANAM

Srinivasa Mangapuram 20 Feb 20 ; It was soothing and serene parade of Kalyana Venkanna on Chandra Prabha vahanam as Darbar Krishnudu during the ongoing annual Brahmotsavams of Sri Kalyana Venkateswara temple at Srinivasa Mangapuram on Thursday evening.

Devotees were thrilled at Lords caravan of elephants, bulls and horses accompaniment of bhajan and kolata teams and offered karpoora Harati along mada streets.

DyEO Sri Yellappa, AEO Dhananjayudu and others  participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

                                                     
చంద్రప్రభ వాహనంపై దర్బార్‌ కృష్ణుని అలంకారంతో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు
      

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 20 ; శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల  నడుమ క‌ల్యాణ శ్రీ‌నివాసుడు చంద్రప్రభ వాహనంపై దర్బార్‌ కృష్ణుని అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.

చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌య్య‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, ప్రధాన అర్చ‌కులు శ్రీబాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.