KALYANA VENKANNA RIDES HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

Srinivasa Mangapuram, 26 Jun. 20: On the evening Day-2 of ongoing annual Sakshatkara Vaibhaotsavam at Sri Kalyana Venkateswara temple of Srinivasa Mangapuram  Lord rode on Hanumanta vahanam.

After morning daily rituals, the utsava idols of Swami and his consorts were rendered grand snapana thirumanjanam.

DyEO Sri Ellappa, AEO Sri Dhanajeya, Temple Suptd Sri Chenagalrayulu, Temple archakas participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు 
తిరుపతి, 2020 జూన్ 26: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండవ రోజైన శుక్రవారంనాడు సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శాస్రోక్తంగా జరిగాయి.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
రాత్రి 7.00 గంట‌లకు ఆల‌య ముఖ మండ‌పంలో స్వామివారిని హనుమంత వాహ‌నంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా  శ‌నివారం గరుడ వాహనంపై స్వామివారు వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హిస్తారు.
క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా  ఈ  కార్యక్రమాలన్నీ ఆల‌యంలో ఏకాంతంగా  నిర్వ‌హించారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ య‌ల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ కె.ధ‌నంజ‌యుడు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగల్రాయులు, శ్రీ రమణయ్య  పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.