KARTHIKA DEEPOTSAVAM OBSERVED WITH RELIGIOUS ECSTASY _ టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం మైదానంలో వైభ‌వంగా కార్తీక మ‌హా దీపోత్స‌వం

SPIRITUAL FERVOUR GRIPS PARADE GROUNDS OF TTD 

KANCHI SEER DELIVERS RELIGIOUS DISCOURSE

 OVER 500 WOMEN DEVOTEES LIT 720 GHEE WICKS AND PERFORM DEEPA DANA PUJA 

 TULASI PLANTS DONATED TO WOMEN PARTICIPANTS ON THE OCCASION

 Tirupati, 30 Nov. 20: The temple city of Tirupati reverberated to the rhythmic vibrations of mantras rendered by the vedic scholars while the Paraded Grounds of TTD illuminated with the lights emanating from ghee lit lamps lit by hundreds of women devotees under the natural flash of full moon.

The Karthika Maha Deepotsavam programme organized by TTD in Tirupati received huge response from devotees as millions and millions witnessed the fete live on SVBC.

HH Sri Vijayendra Saraswathi Swamy of Kanchi Kamakoti Peetham delivered religious discourse on the celestial occasion.

After the rendition of community Vishnu Sahasra Nama Parayanam, Sri Maha Lakshmi Shodasa Puja performed. During his religious discourse the Kanchi seer said the event marked Siva Kesava Abedham in the holy month of Karthika. He also elaborated on the importance of Deepa Danam in Hindu Sanatana Dharma and lauded the efforts of TTD authorities in designing the programme.

ASTALAKSHMI DANCE BY SV MUSIC AND COLLEGE A CYNOSURE 

The Astalakshmi Vaibhavam damce presented the students of SV College of Music and Dance of TTD captivated the gathering with their awesome performance.

LITTING 720 WICKS DEEPAM

The three hour long event concluded with the women devotees litting the 720 wicks of ghee lit lamp and observing Karthika Deepotsavam.

TTD EO Dr KS Jawahar Reddy, Board members Sri Sekhar Reddy,  Sri Vaidyanathan Krishnamurthy, Additional EO Sri AV Dharma Reddy, Collector Sri Bharat Narayan Gupta, CVSO Sri Gopinath Jatti, SP Sri Ramesh Reddy, JEOs Sri P Basant Kumar, JEO Health and Education Smt Sada Bhargavi, SVBC CEO Sri Suresh Kumar and other HoDs were also present.

LAURELS ON ARRANGEMENTS

The women devotees who participated in this spiritual event expressed immense pleasure on the never seen before arrangements made by TTD. The arrangements by all departments of TTD and Srivari Seva volunteers made the event to witness an overwhelming success.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కార్తీక మ‌హా దీపోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు

తిరుప‌తి‌, 2020, న‌వంబ‌రు 30: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం రాత్రి నిర్వ‌హించిన కార్తీక మ‌హాదీపోత్స‌వానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. కోవిడ్ నేప‌థ్యంలో భౌతిక‌దూరం పాటిస్తూ 500 మంది మ‌హిళ‌లు కూర్చుని దీపాలు వెలిగించేలా దీప‌పు దిమ్మెలు, నేతి వ‌త్తులు ఏర్పాటుచేశారు. మైదానం మొత్తం తివాచీలు ఏర్పాటుచేశారు. ఒక్కో దీపపు దిమ్మె వ‌ద్ద తుల‌సి మొక్క‌ను ఉంచారు. కార్య‌క్ర‌మం అనంత‌రం మ‌హిళ‌లకు ఈ మొక్క‌ల‌ను అందించారు.

వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు. వేదిక ఇరువైపులా ఆక‌ట్టుకునేలా గంట‌లతో సెట్టింగ్ ఏర్పాటుచేశారు. కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన శ్రీ మ‌హాల‌క్ష్మీపూజ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్ర‌ధాన ద్వారాల నుంచి ఆవ‌ర‌ణం మొత్తం అర‌టి చెట్లు, పూలు, విద్యుద్దీపాల‌తో అలంక‌రించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

కార్తీక దీపారాధనతో అశ్వమేధ యాగ ఫలితం : కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌రస్వ‌తి

పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌రస్వ‌తి ఉద్ఘాటించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం రాత్రి జ‌రిగిన కార్తీక మ‌హా దీపోత్స‌వంలో స్వామీజీ అనుగ్ర‌హ భాష‌ణం చేశారు.

కార్తీక మాసంలో దీపపూజ, దీపదానం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమని స్వామీజీ అన్నారు. దీపారాధన వల్ల దేవతలు, ఋషులు, పితృదేవతలు సంతోషిస్తా‌రని, దేశంలోని అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందన్నారు. ఆవునెయ్యితో దీపారాధన అత్యంత శ్రేష్టమన్నారు. దీపారాధనతో నేత్రశక్తి పెరుగుతుందని, ధర్మార్థకామ మోక్షాలు సిద్ధిస్తాయని చెప్పారు. సంధ్యా సమయంలో ప్రతి ఇంటి ముందు దీపం వెలిగించి భగవంతుని ఆరాధించాలన్నారు. పద్మ పురాణం, వామన పురాణం తదితర పలు పురాణాల్లో దీప ప్రాశస్త్యం గురించి వివరించారని చెప్పారు. టిటిడి శ్రీ మహావిష్ణువు క్షేత్రంలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. లోక క్షేమం కోసం టిటిడి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. మహా దీపోత్సవం ద్వారా శ్రీవారు దేశానికి ఆ‌రోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి ప్రసాదించాలని స్వామీజీ ప్రార్థించారు.

టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం మైదానంలో వైభ‌వంగా కార్తీక మ‌హా దీపోత్స‌వం

టిటిడి ఆధ్వ‌ర్యంలో మొద‌టిసారిగా నిర్వ‌హించిన‌ కార్తీక మ‌హాదీపోత్స‌వం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం రాత్రి నిర్వ‌హించిన ఈ దీపోత్స‌వానికి 500 మంది మ‌హిళ‌లు విచ్చేసి నేతిదీపాలు వెలిగించారు. ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో నెల రోజుల పాటు చేప‌ట్టిన హోమాలు, వ్ర‌తాలు, పూజాకార్య‌క్ర‌మాల్లో భాగంగా ఈ దీపోత్స‌వాన్ని టిటిడి నిర్వ‌హించింది. క‌ంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌రస్వ‌తి స్వామివారు భ‌క్తుల‌కు అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

వేద‌స్వ‌స్తితో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. కేంద్రీయ సంస్కృత వ‌ర్సిటీ ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి దీప ప్రాశ‌స్త్యాన్ని తెలియ‌జేశారు. ఎస్వీ వేద వ‌ర్సిటీ ఆచార్యులు శ్రీ కె.పురుషోత్త‌మాచార్యులు విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం చేశారు. శ్రీ‌మ‌హాల‌క్ష్మీపూజ వైభ‌వంగా జ‌రిగింది. విద్యార్థినులు శ్రీ ల‌క్ష్మీ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళి స్తోత్రాన్ని ప‌ఠించారు. ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు డా. ఉషారాణి ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం కూచిపూడి నృత్యం అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. అనంతరం పండితులు చెబుతున్న మంత్రాన్ని ప‌ఠిస్తూ మ‌హిళ‌లందరూ సామూహికంగా దీపాలు వెలిగించారు.

కార్తీక మ‌హాదీపోత్స‌వంలోని దీపాలను చూడ‌డం వ‌ల్ల కీట‌కాలు, జంతువులు, చెట్లు, సామాన్య మాన‌వులు, పండితులు పున‌ర్జ‌న్మ లేకుండా మోక్షాన్ని పొందుతార‌ని పండితులు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్త దంపతులు,ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి,శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ దంపతులు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు,జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ దంపతులు,,జె ఈ ఓ శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి స్వర్ణలత , అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి దంపతులు , ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర, ఎస్వీబీసీ సిఈవో శ్రీ జి.సురేష్‌కుమార్‌, కేంద్రీయ సంస్కృత వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర‌శ‌ర్మ‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

కార్తీక దీపం వెలిగించిన కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌రస్వ‌తి

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం రాత్రి జ‌రిగిన కార్తీక మ‌హా దీపోత్స‌వంలో కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌రస్వ‌తి కార్తీక దీపం వెలిగించారు.

టిటిడి ఉన్నతాధికారులతోపాటు మహిళలందరూ నేతిదీపాలు వెలిగించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.