KARTHIKA MASA DEEKSHA COMMENCES WITH VISHNU SALIGRAMA PUJA _ వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా విష్ణుసాల‌గ్రామ పూజ‌

Tirumala, 19 Nov. 20: The month long religious event mulled by TTD in the holy month of Karthika in the name of Karthika Masa Deeksha commenced with Vishnu Saligrama Puja on Thursday at Vasanta Mandapam in Tirumala.

Speaking on the occasion, the Vaikhanasa Agama Advisor of TTD, Sri Mohana Ranga Charyulu said Salagrama is considered as the most sacred rock forms usually used for worship in every Sri Vaishnavaite temple.

Worshipping Lord Sri Maha Vishnu in Karthika masam has a significant role in Puranas and hence TTD has mulled this unique month long fete to save humanity from the dreadful coronavirus impact.

Later the ritwiks rendered Panchamrutabhishekam to the Salagramas with milk, curd, honey, turmeric and sandal paste under the aegis of Chief Priest Sri Venugopala Deekshitulu.

Agama Advisor Sri Sundaravaradan Swamy, TTD Additional EO Sri AV Dharma Reddy, Vedic Scholar Sri Rani Sadasivamurthy, CEO SVBC Sri Suresh Kumar, Temple DyEO Sri Harindranath, Temple Peishkar Sri Jagan Mohanacharya, Potu Peishkar Sri Srinivas were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా విష్ణుసాల‌గ్రామ పూజ‌

తిరుమల‌, 2020 నవంబరు 19: క‌రోనా నేప‌థ్యంలో లోక‌క్షేమాన్ని కాంక్షిస్తూ ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన కార్య‌క్ర‌మాల్లో మొద‌ట‌గా విష్ణుసాల‌గ్రామ పూజ గురువారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా జ‌రిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ మండ‌పంలో శ్రీ భూవ‌రాహ‌స్వామి, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ప్ర‌తిమ‌ల‌ను ఏర్పాటుచేశారు. అదేవిధంగా, ఉసిరి, ల‌క్ష్మీ తుల‌సి, రామ‌తుల‌సి, కృష్ణ‌తుల‌సి త‌దిత‌ర ప‌విత్ర‌మైన చెట్ల‌ను కొలువుదీర్చారు. ముందుగా ప్రార్థ‌నా సూక్తం, అష్ట‌దిక్పాల‌క ప్రార్థ‌న‌, న‌వ‌గ్ర‌హ ప్రార్థ‌న‌తో విష్ణుసాల‌గ్రామ పూజ‌ను ప్రారంభించారు. అనంత‌రం వేద‌పండితులు వేద‌మంత్రాలు ప‌ఠిస్తుండ‌గా అర్చ‌కులు సాల‌గ్రామాల‌కు పాలు, పెరుగు, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ఆ త‌రువాత  శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, సాల‌గ్రామాల‌కు హార‌తులు స‌మ‌ర్పించారు. నైవేద్యం స‌మ‌ర్పించిన అనంత‌రం క్షమా మంత్రం, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ సాల‌గ్రామాలు సాక్షాత్తు విష్ణువు అవ‌తార‌మ‌ని, సాల‌గ్రామ పూజ వ‌ల్ల స‌ర్వ‌జ‌న ర‌క్ష‌ణ‌, స‌మ‌స్త బాధ‌ల ఉప‌శ‌మ‌నం క‌లుగుతాయ‌ని తెలిపారు. సాల‌గ్రామాల‌కు చేసిన అభిషేక తీర్థాన్ని సేవిస్తే స‌మ‌స్త పాపాలు తొల‌గి, స‌ర్వ‌వ్యాధులు నివారించ‌బ‌డ‌తాయ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు శ్రీ రాణి స‌దాశివ‌మూర్తి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్ మోహ‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.