KARVETINAGARAM BRAHMOTSAVAMS FROM MAY 26_ కార్వేటినగరము శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
By TTD News On 17 May, 2019 At 07:53 PM | Categorized As General News

Tirupati, 17 May 19: The annual brahmotsavams in Sri Venugopala Swamy temple at Karvetinagaram will be observed from May 26 to June 3.

The wall posters for the same were released by Tirupati JEO Sri B Lakshmikantham in Tiruchanoor on Friday.

On May 21 Koil Alwar Tirumanjanam, May 25 Ankurarpanam takes place for the annual fete.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కార్వేటినగరము శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, 2019 మే 17: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కార్వేటినగరములోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి. లక్ష్మీకాంతం శుక్రవారం ఆవిష్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 26 నుండి జూన్ 3 వరకు వైభవంగా నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా మే 21వ తేది మంగళవారం కోయల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 25వ తేది శనివారం సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

26-05-2019( ఆదివారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం

27-05-2019(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

28-05-2019(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

29-05-2019(బుధవారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

30-05-2019(గురువారం) మోహినీ అవతారం గరుడ వాహనం

31-05-2019(శుక్రవారం) హనుమంత వాహనం గజ వాహనం

01-06-2019(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

02-06-2019(ఆదివారం) రథోత్సవం అశ్వవాహనం

03-06-2019(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 29వ తేదీ సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూన్ 4 సాయంత్రం 4.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ ఈ.సి శ్రీధర్, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v