KERALA TEAM APPRAISED ON DIGITAL TICKETING SYSTEM BY TTD_ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ విధానాలపై కేరళ ప్రభుత్వ కమిటీ అధ్యయనం వివరాలు తెలియజేసిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirupati , October 8: Tirumala JEO Sri KS Sreenivasa Raju elaborated on the strategies and systems adopted by TTD for devotee management at the holy shrine of Tirumala to the three-member team deputed by Kerala Government with high profile officials.

Earlier, the JEO briefed them with help of Power Point presentation held at the Sri Padmavati Rest house in Tirupati on Monday on the use of IT for facilitating darshan, accommodation, donations etc. by TTD which had helped in providing comfortable pilgrimage to multitude of visiting pilgrims in Tirumala.

The JEO said, under the instructions of Executive Officer Sri Anil Kumar Singhal, TTD has adopted IT in almost all its darshan formats to enhance transparency which yielded positive results. Be it Rs.300 Special Entry Darshan or Divya Darshan (footpath), Sarva Darshan, the time slotted darshan system has enabled the management to provide hassle free darshan to 75% of our pilgrims”, he asserted.

The IT adoption has also provided transparency and proper regulation of not only pilgrim crowds but also other core activities of the TTD like sale and distribution of laddu prasadam, publications, hundi donations etc. The JEO later explained them on queue lines management, compartments, cleanliness, garbage clearance, recycling, drinking water facilitation, reuse of tertiary water after treatment etc at Tirumala which fascinated the team.

Sri Kamalavardhan Rao, Principal Secretary of Public Works Department, Kerala, Sri K R Jyotilal, Principal Secretary ( Revenue Endowments), Addl. DGP Sri Ananta Krishnan later complimented TTD for its pilgrim initiatives and said they will adopt the IT measures in Kerala temples including Sabarimala for a hassle free darshan mechanism.

FA and CAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, IT Chief Sri Sesha Reddy, Dy E O Srivari Temple Sri Harindranath, Special Officer Annaprasadam Sri Venugopal also participated in the event.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ విధానాలపై కేరళ ప్రభుత్వ కమిటీ అధ్యయనం వివరాలు తెలియజేసిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుపతి, 2018 అక్టోబరు 08: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టిటిడి అనుసరిస్తున్న విధానాలపై కేరళ ప్రభుత్వ త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయంలో రద్దీ క్రమబద్ధీకరణ విధానాలను అమలుచేసేందుకు ఈ కమిటీ సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమావేశమైంది. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఈ సందర్భంగా టిటిడి విధానాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కూలంకషంగా వివరించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆలోచనల మేరకు సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా 75 శాతం మంది భక్తులకు నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు. దర్శన విధానాలకు సంబంధించి ఐటి పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పారదర్శకంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం సాధ్యమవుతోందన్నారు. భక్తులకు కల్పిస్తున్న దర్శనం, అన్నప్రసాదం, బస, భద్రత, రవాణా సౌకర్యాల గురించి వివరించారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వినియోగించడం తదితర అంశాల గురించి తెలియజేశారు.

కేరళ ప్రభుత్వ ప్రజాపనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కమలవర్ధన్‌రావు మాట్లాడుతూ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు టిటిడి అనుసరిస్తున్న విధానాలు చక్కగా ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో కేరళ ప్రభుత్వ రెవెన్యూ(దేవాదాయ) ముఖ్య కార్యదర్శి శ్రీకె.ఆర్‌.జ్యోతిలాల్‌, అదనపు డిజి శ్రీ అనంతకృష్ణన్‌, టిటిడి ఎఫ్‌ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.